ముదిగొండ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. శాస్త్రవేత్త బట్టు కృష్ణారావు ఈ మండలమునకు చెందినవారు. ముదిగొండ గ్రామం క్రీ.శ.9-12 శతాబ్దాల కాలంలో ముదిగొండ చాళుక్యులకు రాజధానిగా పనిచేసింది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన ఖమ్మం గ్రామీణ మండలం, తూర్పున చింతకాని మండలం, పశ్చిమాన నేలకొండపల్లి మండలం, వాయువ్యాన కూసుమంచి మండలం, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58192. ఇందులో పురుషులు 29030, మహిళలు 29162. రాజకీయాలు: ఈ మండలము మధిర అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన సామినేని హరిప్రసాద్ ఎన్నికయ్యారు. చరిత్ర: ముదిగొండ గ్రామం చాళుక్యులకు రాజధానిగా పనిచేసింది. ముదిగొండ చాళుక్యుల కాలంలో వైభవంగా వెలుగొందిన ప్రాంతమిది. తర్వాత పలు రాజవంశాల చేతులు మారి, ఆధునిక యుగంలో నిజాం పాళనలో కొనసాగి సెప్టెంబరు 17, 1948న భారత యూనియన్‌లో భాగమైంది. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2007లో భూమి కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 6గురు మరణించారు. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింద్. ఇది ముగిగొండ సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. 2009-14 కాలంలో మలిదశ ఉద్యమం కూడా ఇక్కడ కొనసాగింది. 2011లో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె సంపూర్ణంగా సాగింది. కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళలు, కార్మికులు పాల్గొన్నారు. జూన్ 2, 2014న తెలంగాణలో భాగమైంది.
ముదిగొండ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Ammapeta, Banapuram, Chirumarri, Gandhasiri, Gangapuram D, Gokinapally, Kamalapuram, Kanapuram, katkoor, Madhapuram, Mallaram, Medepally, Mudigonda, Muttharam, Narsapuram D, Pammi, Pandregipally, Peddamandava, Suvarnapuram, Vallabhi, Vallapuram, Venkatapuram, yedavelli
ప్రముఖ గ్రామాలు: మేడేపల్లి (Medipally): మేడేపల్లి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలమునకు చెందిన గ్రామము. జాతీయస్థాయి నేతగా పేరుపొందిన దారపునేని కోటేశ్వరరావు ఈ గ్రామానికి చెందినవారు. ఈయన ప్రముఖ జనసంఘ్ నాయకుడు, 1975లో అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళారు. భాజపా జిల్లా అధ్యక్షునిగా, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ముదిగొండ (Mudigonda): ముదిగొండ ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. శాస్త్రవేత్త బట్టు కృష్ణారావు ఈ గ్రామానికి చెందినవారు. వ్యవసాయ రంగంలో ఈయన అనేక పరిశోధనలు చేశారు. 2005లో జాతీయ సైన్సు కాంగ్రెస్ సదస్సులో బెస్ట్ ప్రెజెంటేషన్ అవార్డు పొందారు. ముదిగొండ గ్రామం క్రీ.శ.9-12 శతాబ్దాల కాలంలో ముదిగొండ చాళుక్యులకు రాజధానిగా పనిచేసింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mudigonda Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి