పెనుబల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 33 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఈ మండలనకు చెందినవారు. మండలంలో లంకాసాగర్ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఉంది. ఇది సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగము. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున సత్తుపల్లి మండలం, ఆగ్నేయాన వేంసూర్ మండలం, పశ్చిమాన కల్లూరు మండలం, ఉత్తరాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52864. ఇందులో పురుషులు 26249, మహిళలు 26615. రాజకీయాలు: ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన లక్కినేని అలేఖ్య ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు:
Adavimallayala, Bayyannagudem, Bhavnnapalem, Chinthagudem, Chowdaram, Ganeshpadu, Gollagudem, Gowararam, Karaigudem, Kondrupadu, Kuppenakuntla, Lankapalli, lingagudem, Mandalapadu, Penuballi, Ramachandrapuram, Tallapenta, Tekulapalli, Telgaram, Tummalapalli, Yerugatla
ప్రముఖ గ్రామాలు: .బయన్నగూడెం (Bayannagudem): బయన్నగూడెం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలమునకు చెందిన గ్రామము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Penuballi Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి