తల్లాడ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పశ్చిమ సరిహద్దులో వైరా రిజార్వాయర్ ఉంది. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున మరియు దక్షిణాన కల్లూరు మండలం, పశ్చిమాన కొణిజెర్ల మండలం, నైరుతిన వైరా మండలం, ఉత్తరాన ఎన్కూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55825. ఇందులో పురుషులు 27945, మహిళలు 27880. రాజకీయాలు: ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన దొడ్డా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు:
Annarugudem, Balapeta, Baswapuram, Billupadu, Gopalpeta, Kalakodima, Kodavatimetta, Kurnavalli, Laxmipuram, Mallaram, Mittapalli, Muddunuru, Nutankal, Pinapaka, Ramanujavaram, Rejerla, Tallada, Telagaram, Vengannapeta
ప్రముఖ గ్రామాలు: .గోపాల్‌పేట (Tallada): గోపాల్‌పేట ఖమ్మం జిల్లా తల్లాడ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో బయోమెడికల్ వేస్టేజీ ప్లాంట్ నిర్మించబడింది ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tallada Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి