వేంసూర్ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన పెనుబల్లి మండలం మరియు సత్తుపల్లి మండలం ఉండగా మిగితా వైపులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42908. ఇందులో పురుషులు 21845, మహిళలు 21063. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45233. ఇందులో పురుషులు 22914, మహిళలు 22319. రాజకీయాలు: ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన పగుట్ల వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు:
Adasarlapadu, Ammapalem, Bharanipadu, Chowdaram (Ogiralavada), Duddepudi, Guduru, Kallurugudem, Kandukuru, Kondrugatlamallela, Kunchaparthy, Pallevada, Vemsoor, Vennachedu, Yerragunta
ప్రముఖ గ్రామాలు: .కందుకూరు (Kandukur): కందుకూరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 5 దశాబ్దాల చరిత్ర ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. మండల కేంద్రం వేంసూరు తర్వాత మండలంలో ఇది అత్యధిక జనాభా కల రెండవ గ్రామము. కుంచపర్తి (kunchakurthy): కుంచపర్తి ఖమ్మం జిల్లా వేంసూర్ మండలమునకు చెందిఅ గ్రామము. గ్రామంలో మారెమ్మ ఆలయం ఉంది వేంసూరు (Vemsur): వేంసూరు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Vemsur or Vemsoor Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి