సత్తుపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలోని బేతుపల్లి చెరువు నుంచి తమ్మిలేరు నది పుట్టుతుంది. మండల పరిధిలో కాకతీయుల మరియు రెడ్డి రాజుల కాలం నాటి ప్రాచీన దేవాలయాలు, కోటలు ఉన్నాయి. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతితూర్పున ఉంది. ఈ మండలానికి పశ్చిమాన పెనుబల్లి మండలం, దక్షిణాన వేంసూర్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర:
సత్తుపల్లికి వెయ్యేళ్ళ ఘనచరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండటమే కాకుండా ఈ మండల పరిధిలో పలు దేవాలయాలు, నిర్మాణాలు చేశారు. తుమ్మూరు, తర్వాత రెడ్డి రాజులు 2 శతాబ్దాలు పాలించారు. రెడ్డిరాజులు తుమ్మూరు (తుంబూరు)లో మట్టికోటను, కళ్యాణమండపాన్ని నిర్మించారు. రెడ్డిరాజుల తర్వాత నిజాంలు పాలించారు. 1947-48లో రజాకార్లకు, నిజాం పాలనకు వ్యతిరేకంగా సత్తుపల్లికి యోధులు ఉద్యమించారు. సెప్టెంబరు 1948లో నిజాం పాలన ముగిసి భారత యూనియన్ లో హైదరాబాదు రాష్ట్రంలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె సంపూర్ణంగా జరిగింది. జూన్ 2, 2014లో మండలం తెలంగాణలో భాగమైంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77074. ఇందులో పురుషులు 38424, మహిళలు 38650.
సత్తుపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Ayyagaripeta, Bethupally, Cherukupally, Dacharam, Jaganadhapuram, Kakarlapally, Kistaram, Kommepally, Regallapadu, Rejerla, Rudrakashapally, Sadhasivunipalem, Sathupally, Siddharam, Thumburu, Yathalakunta
ప్రముఖ గ్రామాలు: .బేతుపల్లి (Bethupalli): బేతుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలమునకు చెందిన గ్రామము. కాకతీయ బేతరాజు మీదుగా గ్రామానికి ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. గ్రామంలో కాకతీయుల కాలం నాటి పురాతనమైన శివాలయం ఉంది. సత్తుపల్లి (Sattupaly): సత్తుపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం మరియు మండల కేంద్రము. సత్తుపల్లిలో శ్రీజ్ఞానసరస్వతీ దేవాలయం ఉంది. ఇది పురపాలక సంఘము మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sathupalli or Sattupali Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి