వైరా ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు.మండల పరిధిలో వైరా జలాశయం ఉంది. విమోచనోద్యమ నాయకుడు కందిబండ రంగారావు, సాహితీవేత్త కావూరి పాపయ్యశాస్త్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన మల్లు అనంత రాములు ఈ మండలమునకు చెందినవారు. మండలం గుండా వైరానది ప్రవహిస్తోంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున తల్లాడ మండలం, దక్షిణాన మధిర మండలం, నైరుతిన బోనకల్ మండలం, పశ్చిమాన చింతకాని మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన కొణిజెర్ల మండలం, ఆగ్నేయాన కొంతభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54333. ఇందులో పురుషులు 26788, మహిళలు 27545. రాజకీయాలు: ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ప్రముఖ రాజకీయ నాయకులు మల్లు అనంతరాములు, మల్లు రవి ఈ మండలమునకు చెందినవారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన వేల్పుల పావని ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు:
Astanagurthi, Brahmanapalli (AG), Dachapuram, Gannavaram, Garikapadu, Gollapudi, Gollenapadu, Khanapuram, Kondakodima, Lingannapalem, Medibanda, Musalimadugu, Narapunenipalli, Paladugu, Poosalapadu, Punyapuram, Rebbavaram, Siripuram (KG), Somavaram, Tatipudi, Vallapuram, Veppalamadaka
ప్రముఖ గ్రామాలు: .ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Wyra or Vyra, Waira Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి