న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన మాధవనేని రఘునందన్ రావు మార్చి 23, 1968న సిద్ధిపేటలో జన్మించారు. ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడిన రఘునందన్ రావు ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతాపార్టీలో చేరి పేరుతెచ్చుకున్నారు. భాజపా అధికార వ్యాఖ్యాతగా కూడా కొనసాగినారు. 2014 మరియు 2018లలో భాజపా తరఫున దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయిననూ 2020 ఉప ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ప్రారంభ జీవనం: సిద్ధిపేటలో జన్మించిన రఘునందన్ రావు స్థానికంగా డిగ్రీకళాశాలలో బీఎస్సీ పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసిచారు. విద్యాభ్యాసం తర్వాత 1991లో నివాసాన్ని పటాన్‌చెరుకు మార్చినారు. అక్కడే ఐదేళ్ళు ఈనాడు దినపత్రిక న్యూజ్ కంట్రిబ్యూటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయవాదిగా బార్ అసోసియేషన్‌లో పేరు నమోదుచేయించుకున్నారు రాజకీయ ప్రస్థానం: ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా విధేయుడైన రఘునందన్ రావు 2001 నుంచి తెరాసలో కొనసాగినారు. ఉమ్మడి మెదక్ జిల్లా తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ పనిచేశారు. తర్వాత భాజపాలో చేరి ఆ పార్టీ అధికార వ్యాఖ్యాతగా మారారు. 2014 మరియు 2018లలో భాజపా తరఫున పోటీచేసి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. సోలిపేట మరణంతో 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ప్రతిష్టాత్మకమైన పోరులో విజయం సాధించారు.
= = = = =
|
10, నవంబర్ 2020, మంగళవారం
మాధవనేని రఘునందన్ రావు (Madhavaneni Raghunandan Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి