23, మార్చి 2014, ఆదివారం

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం (Dubbaka Assembly Constituency)

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 3 మండలాలు కలవు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. ఈ సెగ్మెంట్ మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. పూర్వపు దొమ్మాట స్థానం మార్పులు చెంది ఇది ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2014 సోలిపేట రామలింగారెడ్డి తెరాస చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 సోలిపేట రామలింగారెడ్డి తెరాస మద్దుల నాగేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2020* ఎం.రఘునందన్ రావు భాజపా
సోలిపేట సుజాత
తెరాస

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి తన స్మీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిపై 2640 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2004, 2008లలో తలపడిన ప్రత్యర్థులే మళ్ళీ ఎదురైనారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 3 సార్లు వరస విజయాలు సాధించి 2 సార్లు ఓటమి చెందిన ముత్యంరెడ్డి ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున నాగేశ్వర్ రెడ్డి, భాజపా తరఫున గిరీష్ రెడ్డి పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన రామలింగారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ముత్యంరెడ్డిపై 37939 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున సోలిపేట రామలింగారెడ్డి, భాజపా తరఫున ఎం.రఘునందన్ రావు, జనకూటమి తరఫున తెలంగాణ జనసమితి పార్టీకి చెందిన చిందం రాజ్‌కుమార్ పోటీచేశారు. తెరాసకు చెందిన సోలిపేట రామలింగారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి పై 62500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2020 ఆగస్టులో రామలింగారెడ్డి మరణించారు.
 
2020 ఉప ఎన్నిక:
2018 ఎన్నికలలో విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డీ మరణంతో 2020 నవంబరులో ఉప ఎన్నిక జరిగింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికలో భారతీయ జనతాపార్టీకి చెందిన అభ్యర్థి ఎం.రఘునందన్ రావు తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన సోలిపేట సుజాతపై వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు.
హోం,
విభాగాలు: మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోకసభ నియోజకవర్గం, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక