17, నవంబర్ 2020, మంగళవారం

పాట్నా (Patna)

రాష్ట్రం
బీహార్
జనాభా
17 లక్షలు (2011)
ప్రాచీననామం
పాటలీపుత్ర
ప్రముఖులు
ఆర్యభట్ట, గురు గోవింద్ సింగ్,
పాట్నా బీహార్ రాష్ట్ర రాజధాని మరియు రాష్ట్రంలో పెద్ద నగరం. గంగానది తీరాన ఉన్న ఈ నగరం 2011 లెక్కల ప్రకారం సుమారు 17 లక్షల జనాభాతో దేశంలో 19వ పెద్ద నగరంగా ఉంది. క్రీ.పూ.4వ శతాబ్దిలో మగధ సామ్రాజ్య కాలంలో స్థాపించబడ్డ పాట్నా దేశంలోనే అతి పురాతనమైన నివాసిత నగరాలలో ఒకటి. ప్రాచీన కాలంలో పాటలీపుత్రగా పిల్వబడిన ఈ నగరం కేంద్రంగా హర్యంక, నంద, మౌర్య, శుంగ, గుప్త రాజవంశాలు పాలించాయి. ప్రాచీన భారతంలో ప్రముఖులైన ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు లాంటివారు ఈ నగరంతో సంబంధం కల్గియున్నారు. పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జన్మస్థానంగా ఉన్నందున పాట్నా సిక్కుల పవిత్ర ప్రదేశంగానూ పరిగణించడం జరుగుతుంది.
 
భౌగోళికం:
తూర్పు భారతదేశంలోని ప్రముఖ పట్టణాలలో ఒకటైన పాట్నా గంగానది దక్షిణ తీరంలో ఉంది. 136 చకిమీ వైశాల్యంతో, 2011 లెక్కల ప్రకారం 17 లక్షల జనాభాను కల్గియున్న పాట్నా నగరం 25.6° ఉత్తర అక్షాంశం, 85.1°తూర్పు రేఖాంశంపై ఉంది. పాట్నా మరియు హాజీపూర్‌లను కల్పే మహాత్మాగాంధీ సేతు దేశంలోనే పొడవైన నదీ వంతెనగా పేరుపొందింది. 

చరిత్ర:
క్రీ.పూ.490లో మగధ పాలకుడు అజాతశత్రువుచే పాటలీపుత్ర నగరం స్థాపించబడింది. అంతకుపూర్వం రాజగృహగా ఉండిన రాజధానిని అజాతశత్రువు పాతలీపుత్రానికి మార్చి పాలించాడు. బౌద్ధమత స్థాపకుడైన గౌతమబుద్ధుడు కూడా ఈ ప్రాంతాన్ని సంచరించినట్లుగా చరిత్ర ప్రకారం తెలుస్తుంది. ఆ తర్వాత మౌర్యుల కాలంలో ప్రముఖ విదేశీ పర్యాటకులు మెగస్తనీస్, ఫాహియాన్‌లు పాట్నాను సందర్శించారు. భారతదేశంలోనే ప్రముఖ రాజవంశమైన గుప్తులు కూడా పాటలీపుత్ర కేంద్రంగా పాలించారు. పాలరాజ్యం, మొఘల్ సామ్రాజ్యంలో పాతలీపుత్ర భాగంగా ఉండెది. క్రీ.శ.1620లో ఈస్టిండియా కంపెనీ పాట్నాలో ఫాక్టరీని ఏర్పాటుచేసింది. బ్రిటీష్ కాలంలో ప్రారంభంలో బెంగాల్ ప్రావిన్సులో భాగంగా ఉన్న పాట్నా 1912లో ప్రత్యేకంగా బీహార్ అండ్ ఒరిస్సా ప్రావిన్సు ఏర్పాటుతో ప్రావిన్సు రాజధాని అయింది. జాతీయోద్యమంలో పాట్నా నుంచి పలువులు సమరయోధులు పోరాడారు. స్వాతంత్ర్యానంతరం కూడా బీహార్ రాష్ట్రానికి పాట్నా రాజధానిగా కొనసాగుతూ ఉంది.

నగర పాలన:
పాట్నా నగర పాలన నగరపాలక సంస్థచే జరుగుతుంది. 1864లో ఏర్పడిన పాట్నా పురపాలక సంఘం 1952లో నగరపాలక సంస్థగా హోదా పొందింది. ప్రస్తుతం పాట్నా నగరపాలక సంస్థలో 6 సర్కిళ్ళు, 75 డివిజన్లు ఉన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీస్ మిషన్‌లో కూడా ఈ నగరపాలక సంస్థ భాగంగా ఉంది.

రవాణా సౌకర్యాలు:
పాట్నాలో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. నగరంలో పలు రైల్వే స్టేషన్లు ఉండగా అందులో పాట్నాజంక్షన్ రైల్వేస్టేషన్ ముఖ్యమైనది. ఇది హౌరా-ఢిల్లీ మార్గంలో ఉంది. నగరంలోని దానాపూర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లో డివిజన్ కేంద్రంగా ఉంది. జాతీయ రహదారులు నెం.19, 30, 31, 83 నగరం గుండా వెళ్తున్నాయి.
 
 
 
ఇవి కూడా చూడండి:
 
 


హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు-రాజధానులు, బీహార్, భారతదేశ నగరాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక