23, జనవరి 2013, బుధవారం

ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Alampur Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న పెబ్బేరు మండలం వనపర్తి నియోజకవర్గంలోకి వెళ్ళిపోగా, గద్వాల నియోజకవర్గం నుంచి కొత్తగా అయిజ మండలం వచ్చి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రావుల రవీంద్రనాథ్ రెడ్డి 3 సార్లు విజయం సాధించారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి జరిగిన 16 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ 3 సార్లు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు, జనతాపార్టి ఒకసారి విజయం సాధించాయి.
(ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం)
(తెలుగు వికీపీడియా సౌజన్యంతో- సభ్యుడు దేవా)

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గ భౌగోళిక సమాచారం
మహబూబ్‌నగర్ జిల్లాలో దక్షిణంగా ఉన్న ఈ నియోజకవర్గం దక్షిణాన కర్నూలు జిల్లాతో తుంగభద్ర నది వేరు చేస్తున్నది. పశ్చిమాన కొంతభాగం కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉంది. ఈశాన్యమున వనపర్తి నియోజకవర్గం మరియు కొల్లాపూర్ నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. వాయువ్యమున గద్వాల నియోజకవర్గం సరిహద్దును కలిగి ఉంది. నియోజకవర్గం గుండా ఇటిక్యాల మరియు మానవపాడు మండలాల మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది. సికింద్రాబాదు - డోన్ రైలుమార్గం కూడా నియోజకవర్గం నుంచి వెళ్ళుచున్నది. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదైన జోగుళాంబ శక్తిపీఠం ఆలంపుర్ లో ఉన్నది.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 నాగన్న కాంగ్రెస్ పార్టీ జమ్మన స్వతంత్ర అభ్యర్థి
పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ టి.చంద్రశేఖర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1957 జయలక్ష్మీ దేవమ్మ కాంగ్రెస్ పార్టీ జనార్ధనరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1962 మురళీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాగ పుల్లారెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 టి.చంద్ర శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జనార్ధనరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 టి.చంద్ర శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1974 (ఉ) టి.రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 రాంభూపాల్ రెడ్డి జనతా పార్టీ టి.రజనీబాబు స్వతంత్ర అభ్యర్థి
1983 టి.రజనీ బాబు తెలుగుదేశం పార్టీ టి.ఎల్.ఎస్.దేవి కాంగ్రెస్ పార్టీ
1985 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బి.అనసూయమ్మ కాంగ్రెస్ పార్టీ
1989 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ టి.రజనీబాబు కాంగ్రెస్ పార్టీ
1994 కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ డి.విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వావిలాల సునీత తెలుగుదేశం పార్టీ
2009 అబ్రహాం కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ తెలుగుదేశం పార్టీ
2014 సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అబ్రహాం తెలుగుదేశం పార్టీ
2018 అబ్రహాం తెరాసక సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావుల రవీంద్రనాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తకోత ప్రకాష్ రెడ్డిపై 30254 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. రవీంద్రనాథ్ రెడ్డి 53588 ఓట్లు సాధించగా, ప్రకాష్ రెడ్డికి 23334 ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గం నుండి మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయగా భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి మద్దతి ఇచ్చింది. పోటీలో ఉన్న మిగితా ఐదుగురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా వెంకట్రామి రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన వావిలాల సునీతపై 4191 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. వెంకట్రామిరెడ్డి 37449 ఓట్లు సాధించగా, సునీతకు 33258 ఓట్లు లభించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్రహాం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ప్రసన్నకుమార్ పై 1194 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సంపత్ కుమార్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్రహాంపై 6839 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున వీఎం అబ్రహాం, భాజపా తరఫున రజనీ మాధవరెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సంపత్ కుమార్ పోటీచేశారు. తెరాసకు చెందిన వీఎం అబ్రహాం తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సంపత్ కుమార్ పై 44,679 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గ ప్రముఖులు
  • నాగన్న:
  • పాగ పుల్లారెడ్డి:
  • జయలక్ష్మీ దేవమ్మ:
  • మురళీధర్ రెడ్డి:
  • టి.చంద్ర శేఖర్ రెడ్డి:
  • చల్లా రాంభూపాల్ రెడ్డి:
  • టి.రజనీ బాబు:
  • రావుల రవీంద్రనాథ్ రెడ్డి: ఈ నియోజకవర్గం నుండి రావుల రవీంద్రనాథ్ రెడ్డు మూడు సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించారు. 1985లో మొదటిసారి విజయం సాధించగా, 1989లో కూడా గెలిచి వరుసగా రెండో పర్యాయం శాసనసభఎలో అడుగుపెట్టారు. 1999 ఎన్నికలలో కూడా భాజపా తరఫున విజయం సాధించి మూడవసారి ఎమ్మేల్యే అయ్యారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల అతను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2004 ఎన్నికలలో తెరాస తరఫున పోటీచేసిననూ విజయం దక్కలేదు. మూడోస్థానంలో నిలిచారు. 
  • కొత్తకోట ప్రకాష్ రెడ్డి:
  • చల్లా వెంకట్రామిరెడ్డి:
  • అబ్రహాం:
  • జమ్మన:
  • జనార్ధనరెడ్డి:
  • ఎన్.రెడ్డి:
  • టి.ఎల్.ఎస్.దేవి:
  • బి.అనసూయమ్మ:
  • డి.విష్ణువర్థన్ రెడ్డి:
  • వావిలాల సునీత:
  • ప్రసన్న కుమార్:

విభాగాలు:మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక