ఇటిక్యాల జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. ఇది గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైల్వే లైన్ వెళ్ళుచున్నాయి. జాతీయరహదారిపై వంతెన, బీచుపల్లి క్షేత్రం, కృష్ణానది మధ్యలో నిజాంకొండ కోట ఈ మండల పరిధిలో ఉన్నాయి. నాగర్ కర్నూల్ ఎంపీ మంద జగన్నాథం, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఈ మండలంనకు చెందినవారు.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున గద్వాల మండలము, తూర్పున పెబ్బేరు, మానోపాడు మండలములు, దక్షిణమున వడ్డేపల్లి మండలము, నైరుతివైపున ఐజ మండలము, పశ్చిమాన మల్డకల్ మండలము సరిహద్దులుగాఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42095. ఇందులో పురుషులు 21605, మహిళలు 20490. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52715. ఇందులో పురుషులు 27077, మహిళలు 25638. జనాభాలో ఇది జిల్లాలో 38వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. ఇటిక్యాలలో రైల్వేస్టేషన్ ఉంది. 44వ నెంబరు జాతీయ రహదారి కూడా మండలం నుంచి వెళ్ళుచున్నది. గద్వాల నుంచి జాతీయరహదారిని కలిపే కూడలి ఎర్రవల్లి ప్రముఖమైనది.
ఇటిక్యాల మండలము ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నాగర్‌కర్నూల్ లోకసభ సభ్యుడు మంద జగన్నాథం, ఆలంపుర్ శాసనసభ్యుడు అబ్రహాం ఈ మండలమునకు చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన లలితమ్మ విజయం సాధించారు.ఇటిక్యాల ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హన్మంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 27 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 11 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 12 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 11 జడ్పీ), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది. మండలంలో ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామాలు-ఇటిక్యాల, ఉద్ధండాపుర్, చాగాపూర్, కోదండాపూర్, వేముల, వల్లూర్, ధర్మవరం, బీచుపల్లి (గురుకుల), కొండేరు, వావిలాల, బోచువీరపాలెం. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 29389 హెక్టార్లలో 48% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 531 మిమీ. మండలంలో సుమారు 4000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
ఇటిక్యాల మండలం (Itikyal Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి