12, జూన్ 2013, బుధవారం

పి.మహేందర్ రెడ్డి (P.Mahender Reddy)

జననంసెప్టెంబరు 23, 1963
స్వస్థలంగొల్లూరుగూడ (వికారాబాదు జిల్లా)
పదవులు4 సార్లు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్సీ,
భార్యసునీతా రెడ్డి
పట్నం మహేందర్ రెడ్డి వికారాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. సెప్టెంబరు 23, 1963న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గొల్లూరుగూడలో జన్మించిన మహేందర్ రెడ్డి వెటర్నరీ సైన్సులో డిగ్రీ పూర్తి తొలిసారిగా 1994లో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999లో కూడా ఇదే స్థానం నుంచి వరుసగా రెండవసారి శాసనసభలో ప్రవేశించారు. 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావు చేతిలో పరాజయం పొంది, 2009లో మాజీ మంత్రి ఎం.మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్‌పై 13205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించారు.

ఆ తర్వాత తెరాసలో చేరి 2014 ఎన్నికలలో తెరాస తరఫున తాండూరు నుంచి 4వ సారి విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రిమండలిలో స్థానం పొందారు. 2018లో తాండూరు నుంచే పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

వ్యక్తిగత జీవితం:
మహేందర్ రెడ్డి భార్య సునీత 2001లో బంట్వారం నుంచి జడ్పీటీసిగా ఎన్నికై 2001-06 కాలంలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. సునీత 2014లో యాలాల నుంచి జడ్పీటీసిగా ఎన్నికయ్యారు. 2019లో సునీత కోట్‌పల్లి జడ్పీటీసిగా ఎన్నికై వికారాబాదు జడ్పీ చైర్మెన్ పదవి పొందారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమారై. సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి 2018లో కోడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ రాజకీయ నాయకులు, వికారాబాదు జిల్లా రాజకీయ నాయకులు, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు


 = = = = =

Tags: About Patnam Mahender Reddy, Sunitha Mahender Reddy,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక