4, జనవరి 2015, ఆదివారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2015 (Andhra Pradesh News 2015)

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2015 (Andhra Pradesh News 2015)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2015జాతీయ వార్తలు-2015అంతర్జాతీయ వార్తలు-2015క్రీడావార్తలు-2015

జనవరి 2015:
  • 2015, జనవరి 2: సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లను చైతన్యపర్చినందుకు గాను ఈటీవి-ఆంధ్రప్రదేశ్, ఈటీవి-తెలంగాణ ఎన్నికల సంఘంచే పురస్కారం పొందింది.
  • 2015, జనవరి 2: గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా రాంశరణ్ నియమితులైనారు. 
  • 2015, జనవరి 4: ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసార్ (అడుసుమిల్లి జనార్థన్ వరప్రసాద్) మరణించారు. 
  • 2015, జనవరి 7: అనంతపురం జిల్లా మడకశిర సమీపంలో పేటళ్ల వద్ద బస్సులోయలో పడి 15 మంది మరణించారు. 
  • 2015, జనవరి 12: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణించారు. 
  • 2015, జనవరి 18: కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామాన్ని నారా లోకేష్ దత్తత తీసుకున్నారు. 
  • 2015, జనవరి 19: తిరుపతి శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 
  • 2015, జనవరి 19: కడప జిల్లాకు చెందిన కందుల సొదరులు భాజపాలో చేరారు. 
  • 2015, జనవరి 19: సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జీవితా రాజశేఖర్ నియమించబడ్డారు. 
  • 2015, జనవరి 19: శాసనమండలి సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత పాలడుగు వెంకట్రావు మరణించారు. 
  • 2015, జనవరి 23: హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ మరణించారు. 
  • 2015, జనవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ లభించింది. 
  • 2015, జనవరి 31: గుంటూరు జిల్లా తెనాలిలో లక్షా 28 వేల 913 మంది ఒకే సారి హనుమాన్ చాలీసా పారాయణం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 
 ఫిబ్రవరి 2015:
  • 2015, ఫిబ్రవరి 2: పాతతరం నటుడు పీసపాటి వెంకటేశ్వరరావు మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 5: సినీ నిర్మాట అట్లూరి రామారావు మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 7: రంజీట్రోఫి మ్యాచ్‌లో ఆంధ్రాకు చెందిన కే.ఎన్.భగత్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 
  • 2015, ఫిబ్రవరి 8: సీపీఎం 24వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. 
  • 2015, ఫిబ్రవరి 13: ప్రముఖ నవలా రచయిత కేశవరెడ్డి మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 16: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుగుణమ్మ విజయం సాధించింది. 
  • 2015, ఫిబ్రవరి 18: ప్రముఖ చలనచిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించారు. 
  • 2015, ఫిబ్రవరి 19: రాష్ట మంత్రిగా పనిచేసిన సోమశేఖర్ మరణించారు.
  • 2015, ఫిబ్రవరి 19: విశాఖపట్టణానికి చెందిన మహిళా కార్టూనిస్టు రాగతి పండరి మరణించారు. 
  • 2015, ఫిబ్రవరు 21: 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. 
  మార్చి 2015:
  • 2015, మార్చి 2: స్వాతంత్ర్య సమరయోధుడు, ముద్రణారంగ ప్రముఖుడు పరచూరి హన్మంతరావు మరణించారు. 
  • 2015, మార్చి 5: అత్యధిక ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ లిమ్కా రికార్డు సృష్టించింది.
  • 2015, మార్చి 15: సాహితీవేత్త రాళ్లబండి వెంకట ప్రసాదరాజ్ మరణించారు. 
  • 2015, మార్చి 29: పట్టిసీమ ఎత్తిపోతల పథకంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 
  ఏప్రిల్ 2015:
  • 2015, ఏప్రిల్ 1: కడప జిల్లాకు చెందిన రచయిత శశిశ్రీ మరణం. 
  • 2015, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరును అమరావతిగా రాష్ట్ర కేబినెట్ ఖరారుచేసింది. 
  • 2015, ఏప్రిల్ 3: చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటిలో పెప్సికో ప్లాంటు ప్రారంభించబడింది.
  • 2015, ఏప్రిల్ 4: పర్వతారోహకుడు మస్తాబ్ బాబు మరణించాడు. 
  • 2015, ఏప్రిల్ 8: రాష్ట్ర మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి మరణించారు.
  • 2015, ఏప్రిల్ 9: ప్రముఖ హిందీ అష్టావధాని చేబ్రోలు శేషగిరిరావు మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 10: ఆప్కాబ్ చైర్మెన్‌గా పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. 
  • 2015, ఏప్రిల్ 17: మా (సినీ కళాకారుల సంఘం) ఎన్నికలలో అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. 
  • 2015, ఏప్రిల్ 19: సంగీత దర్శకుడు శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) మరణించారు. 
  • 2015, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన కూనవరం, చింతూరు, రామచంద్రాపురం, వర రామచంద్రాపురం మండలాలను రంపచోడవరం నియోజకవర్గం లోనికి, కుక్కునూరు, వేలూరుపాడు మండలాలను పోలవరం నియోజకవర్గంలోకి చేరుస్తూ కేంద్రం గెజిట్ విడుదలచేసింది. 
  • 2015, ఏప్రిల్ 23: కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరుకు చెందిన కలంకారీ హస్తకళాకారుడు కె.శివప్రసాద్ రెడ్డికి 2012 సం.పు జాతీయస్థాయి ఉత్తమ కళాకారుడు పురస్కారం లభించింది.
  • 2015, ఏప్రిల్ 27: సాహితీవేత్త యు.ఏ.నర్సింగమూర్తి మరణం. 
  • 2015, ఏప్రిల్ 28: చేతుల పరిశుభ్రత కార్యక్రమంలో సత్తెనపల్లి మార్కెట్ యార్డు గిన్నిస్ రికార్డు సృష్టించింది.
  • 2015, ఏప్రిల్ 27: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా చదలవాడ కృష్ణమూర్తి నియమించబడ్డారు. 
మే 2015:
  • 2015, మే 7: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే నియమితులైనారు. 
  • 2015, మే 13: ఆర్టీసి సిబ్బంది సమ్మె విరమణ. తెలంగాణలో 44%, ఆంధ్రప్రదేశ్‌లో 43% ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వాలు అంగీకారం. 
  • 2015, మే 23: విద్యావేత్త గుడిమెట్ల సుబ్బారెడ్డి మరణం.
  • 2015, మే 24: సినీ సంగీత దర్శకుడు ఆకాశపు ఆదినారాయణ మరణించారు. 
  • 2015, మే 27: "డ్రన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్" రూపొందించిన అత్యుత్తమ భారతీయ కంపెనీల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 21 కంపెనీలు స్థానం పొందాయి. 
  • 2015, మే 28: నవలా రచయిత్రి పవని నిర్మల ప్రభావతి మరణం.
  • 2015, మే 28: స్వాతంత్ర్యం నుంచి క్రమం తప్పకుండా ఓటుహక్కు వినియోగిస్తున్న అరుదైన ఓటరు కర్నాటి వెంకటరెడ్డి మరణం.
 జూన్ 2015:
  • 2015, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిపూజ జరిగింది. 
  • 2015, జూన్ 8: కృష్ణా జిల్లాకు చెందిన కేవీ చౌదరి కేంద్ర విజిలెన్స్ కమీషనర్‌గా నియమితులైనారు. 
  • 2015, జూన్ 13: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి వాహనం బోల్టాపడి 23+ మరణించారు. 
 జూలై  2015:
  • 2015, జూలై 3: భాజపా జాతీయ మహిళా మోర్చా ఇంచార్జిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమించబడ్డారు. 
  • 2015, జూలై 6: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు భాట్టం శ్రీరామమూర్తి మరణం. 
  • 2015, జూలై 10: ప్రేక్షకులు ఎదురుచూస్తున్న "బాహుబలి" సినిమా విడుదలైంది. 
  • 2015, జూలై 14: గోదావరి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 
  • 2015, జూలై 14: రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 23 మంది మరణించారు.
  • 2015, జూలై 16: సినిమా పాటల గాయకుడు విస్సంరాజు రామకృష్ణ మరణం. 
  • 2015, జూలై 19: తెలుగు ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు.
  • 2015, జూలై 22: బాహుబలు సినిమా పోస్టర్ అతిపెద్ద పోస్తర్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది. 
  • 2015, జూలై 25: కవి చలనాని ప్రసాద్ మరణం. 
  • 2015, జూలై 28: ప్రముఖ హేతువాది ఎన్వీ బ్రహ్మం మరణం. 
 ఆగస్టు 2015:
  • 2015, ఆగస్టు 14: నాస్తికోద్యమ నాయకుడు గోపరాజు లవణం మరణం. 
  • 2015, ఆగస్టు 27: ఆకర్షణీయ నగరాల ప్రాథమిక జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ ఎంపికయ్యాయి. 
సెప్టెంబరు 2015:
  • 2015, సెప్టెంబరు 9: స్వాతంత్ర్య సమరయోధుడు త్రిపురాన రాఘవదాసు మరణం. 
  • 2015.సెప్టెంబరు 16: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలు కృష్ణాలో కలిపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి పైలాన్ ఆవిష్కరించారు. 
  • 2015, సెప్టెంబరు 22: పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు) నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 2 స్థానాలలో విజయం సాధించింది.
  • 2015, సెప్టెంబరు 22: జగ్గయ్యపేటను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చారు. 
అక్టోబరు 2015:
  • 2015, అక్టోబరు 4: నిర్మాత ఏడిద కామేశ్వరరావు మరణించారు.
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014,

Telugu News, తెలుగు వార్తలు,Current events in telugu, current affairs in telugu, Andhrapradesh news in telugu,

3 కామెంట్‌లు:

  1. sir i want 2016 current affirs in ap
    plz upload

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదివరకు రోజూ చేర్చేవాళ్ళము. సమయాభావం వల్ల ఆ పని కుంటుపడింది. సమయం లభించినప్పుడు చేర్చడానికి ప్రయత్నిస్తాము.

      తొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక