అయిజ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో నైరుతి భాగాన కర్నూలు జిల్లా, తుంగభద్ర నది సరిహద్దులో ఉంది. ఈ మండలము గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. వేణీసోంపూర్ గ్రామంలో ప్రసిద్ధమైన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 18 గ్రామపంచాయతీలు, 16 ఎంపీటిసి స్థానాలు, ఒక నగరపంచాయతీ కలవు. మండల కేంద్రంలో తిక్కవీరేశ్వరస్వామి దేవాలయం ఉంది. 2009 అక్టోబరు భారీ వరదల సమయంలో కుట్కనూరులో అన్ని ఇండ్ళు కూలిపోయాయి. 2014లో ఆలంపూర్ నుంచి శాసనసభకు ఎన్నికైన ఎస్.సంపత్ కుమార్ ఈ మండలమునకు చెందినవారు.
మండల సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున మల్డకల్ మండలము, ఈశాన్యమున ఇటిక్యాల మండలము, తూర్పున వడ్డేపల్లి మండలము, దక్షిణమున తుంగభద్రనది, దానికి ఆవల కర్నూలు జిల్లా, పశ్చిమాన కర్టాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 84925. ఇందులో పురుషులు 42886, మహిళలు 42039. జనాభాలో ఇది జిల్లాలో 7వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: కర్నూలు నుంచి రాయచూరు వెళ్ళు రహదారి, గద్వాల నుంచి మంత్రాలయం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నాయి. రాజకీయాలు: అయిజ మండలము ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.జి.లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.2014లో ఆలంపూర్ నుంచి శాసనసభకు ఎన్నికైన ఎస్.సంపత్ కుమార్ ఈ మండలమునకు చెందినవారు. 2014లో అయిజ ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన సుందర్‌రాజ్ ఎన్నికయ్యారు.
2008-09 నాటికి మండలంలో 36 ప్రాథమిక పాఠశాలలు (30 మండల పరిషత్తు, 6 ప్రైవేట్), 18 ప్రాథమికోన్నత పాఠశాలలు (15 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 20 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 10 జడ్పీ, 8 ప్రైవేట్), 3 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 2 ప్రైవేట్) ఉన్నవి. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 27753 హెక్టార్లలో 53% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వేరుశనగ. వరి, పండ్లు, కందులు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 510 మిమీ. మండలంలో సుమారు 5800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. కాలరేఖ:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
అయిజ మండలం (Ieej Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి