10, ఏప్రిల్ 2014, గురువారం

కరీంనగర్ జిల్లా (Karimnagar Dist)

కరీంనగర్ జిల్లా 
మండలాలు16
జనాభా (2011)10,05,711
వైశాల్యం2128 Sq km
రెవెన్యూ డివిజన్లు2
కరీంనగర్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లాకు ఉత్తరాన పెద్దపల్లి జిల్లా, తూర్పున జయశంకర్ జిల్లా, దక్షిణాన జనగామ జిల్లా, ఈశాన్యాన వరంగల్ పట్టణ జిల్లా, పశ్చిమాన రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు, వాయువ్యాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నవి. పెద్దపల్లి- నిజామాబాదు రైలుమార్గం జిల్లా సరిహద్దు వరకు పూర్తయింది. 2016 జిల్లాల పునర్విభజకు ముందు 57 మండలాలు ఉండగా ప్రస్తుతం 4 కొత్త మండలాలతో కలిపి మొత్తం 16 రెవెన్యూ మండలాలు ఉన్నాయి.  జిల్లాలో 313 గ్రామపంచాయతీలు, 178 ఎంపీటీసి స్థానాలు, 15 జడ్పీటీసి స్థానాలు కలవు.


ఎలగందల్ కోట, మానేరు జలాశయం జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలు. ప్రాచీన కందపద్యాలున్న బొమ్మలమ్మ గుట్ట, ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, చారిత్రక ప్రాంతం గొడిశాల ఈ జిల్లాలో ఉన్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, రాజకీయ నాయకుడు జువ్వాడి గౌతంరావు, ముద్దసాని దామోదర్ రెడ్డి, సాహితీవేత్త ముద్దసాని రాంరెడ్డి, విమోచనోద్యమాకారుడు, రచయిత అనభేరి ప్రభాకరరావు, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ జిల్లా భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం భాగంలో ఉంది. కరీంనగర్ జిల్లాకు ఉత్తరాన పెద్దపల్లి జిల్లా, తూర్పున జయశంకర్ జిల్లా, దక్షిణాన జనగామ జిల్లా, ఈశాన్యాన వరంగల్ పట్టణ జిల్లా, పశ్చిమాన రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు, వాయువ్యాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:

నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం సబ్బినాడు అని వ్యవహరించేవారు. 1905కు పూర్వము ఈ ప్రాంతము ఎలగందల్ పేరుతో ఉండేది. 1905లో వరంగల్‌ జిల్లా నుండి పరకాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట మరియు చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు. 1986లో తాలుకాలా స్థానంలో మండలాలు ఏర్పాడ్డాయి. 2016 నాటికి 57 మండలాలు ఉండగా జిల్లాల పునర్విభజన వల్ల 16 మండలాలు మాత్రమే మిగిలాయి.


రవాణా సౌకర్యాలు:
జిల్లా కేంద్రం కరీంనగర్ నుంచి జిల్లాలోని ప్రముఖ పట్టణాలైన హుజురాబాదు తదితర పట్టణాలకు రోడ్డుసౌకర్యం ఉంది. పెద్దపల్లి నుంచి నిజామాబాదు వరకు నిర్మిస్తున్న కొత్త రైలుమార్గం జిల్లా గుండా వెళుతుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, కరీంనగర్ జిల్లా


 = = = = =


1 కామెంట్‌:

  1. Elabotharam revenue's very neat to huzurabad mandal. Pls add elabotharam revenue in huzurabad mandal so that it will develop in agriculture field . Now elabotharam revenue is very dry area in water. It's above the kakatiya canal. If ur add-in it to huzurabad mandal so that it will part of hanamkonda mandal . We accept hanamkonda mandal 100*/*

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక