మధిర ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఈ మండలం ఖమ్మం జిల్లాలో దక్షిణాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు కలవు. చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బోడేపల్లి వెంకటేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ రచయిత చేకూరి రామారావు, 19వ శతాబ్దికి చెందిన ప్రముఖ రచయిత కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ మండలమునకు చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన వైరా మండలం, ఆగ్నేయాన ఎర్రుపాలెం మండలం, వాయువ్యాన బోనకల్ మండలం, తూర్పున, పశ్చిమాన మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 68601. ఇందులో పురుషులు 33868, మహిళలు 34733. పట్టణ జనాభా 22721, గ్రామీణ జనాభా 45880. రాజకీయాలు: ఈ మండలము మధిర అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ప్రముఖ రాజకీయ నాయకుడు నల్లమల గిరిప్రసాద్ ఈ మండలమునకు చెందినవారు. 2014లో మధిర మండల ప్రజాపరిషత్ (ఎంపిపి) అధ్యక్షులుగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వేమిరెడ్డి వెంకట్రావమ్మ గెలుపొందారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మొండెం లలిత ఎన్నికయ్యారు.
Amberpeta, Athkuru, Chilukuru, Dendukuru, Didugupadu, Illuru, Jalimudi, Khammampadu, Madhira, Madupalli, Mallaram, Maturu, Munagala, Nagarappadu, Nakkalagarubu, Nidanapuram, Rayapatnam, Rompimalla, Siddinenigudem, Siripuram (PM), Tondalagoparam, Torlapadu, Vangaveedu, Yellandulapadu, Yendapalli
ప్రముఖ గ్రామాలు:
దెందుకూరు (Dendukuru):ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు ఈ గ్రామానికి చెందినవారు.
ఇల్లూరు (Illur):
మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962, 1967లలో ఎన్నికైన దుగ్గినేని వెంకయ్య, 1972లో ఎన్నికైన దుగ్గినేని వెంకట్రావమ్మ ఇల్లూరుకు చెందినవారు.
ఇల్లెందులపాడు (Illendulapadu):
ప్రముఖ రచయిత చేకూరి రామారావు ఈ గ్రామానికి చెందినవారు. మధిర (Madhira): మధిర ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణము. ఇది నగరపంచాయతి మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రము. 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ మధిరలో జరిగింది.
తొండల గోపవరం (Tondala Gopavaram):
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బోడేపల్లి వెంకటేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్ లు ఈ గ్రామానికి చెందినవారు.
విప్పలమడక (Vippalamadaka): 19వ శతాబ్దికి చెందిన కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Singareni Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి