బోధన్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. బోధన్ చాలా ప్రాచీనమైన ప్రాంతము. బౌద్ధయుగంలోనే అస్మక రాజ్యానికి రాజధానిగా విలసిల్లింది. చాళుక్యులు కూడా ప్రారంభంలో బోధన్ రాజధానిగా పాలించారు. రెండోఅరికేసరి ఆస్థానంలోని పంపకవి చివరి దశలో ఇక్కడే నివశించాడు. శతాబ్దాలపాటు బోధన్ జైనక్షేత్రంగా విరాజిల్లింది. ఇక్కడ బాహుబలి విగ్రహం కూడా ఉండేది. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు బోధన్ తాలుకాలోని గ్రామాలు. మండలంలో ఒక పురపాలక సంఘం, 17 ఎంపీటీసి స్థానాలు, 38 గ్రామపంచాయతీలు, 40 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: బోధన్ మండలం నిజామాబాదు జిల్లాలో వాయువ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున రెంజల్ మండలం, ఎడవల్లి మండలం, దక్షిణాన రుద్రూర్ మండలం, కోటగిరి మండలం, ఆగ్నేయాన వర్ని మండలం, పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: షోడస మహాజనపదాల కాలం నాటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. షోడస మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదానికి ఇప్పటి బోధన్ రాజధానిగా ఉండింది. ఆ తర్వాత మౌర్యులు, గుప్తుల కాలంలో భాగంగా ఉండేది. ఒకప్పుడు గొప్ప జైన కేంద్రంగా వెలిసింది. 11వ శతాబ్దిలో రాష్ట్రకూటులు నిర్మించిన ఆలయం పట్టణంలో కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో వైభవంగా వర్థిల్లిన ప్రాంతమిది. ఆధునిక కాలంలో గోల్కొండ, ఆసఫ్‌జాహీ సుల్తానులకు సామంతులుగా పాలించిన దోమకొండ సంస్థానంలో భాగంగా ఉండి 1948 సెప్టెంబరులో భారత యూనియన్‌లో విలీనమై 1953 వరకు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగింది. 1956-2014 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, జూన్ 2, 2014 నుంచి తెలంగాణలో భాగంగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 143852. ఇందులో పురుషులు 71392, మహిళలు 72460. పట్టణ జనాభా 77639, గ్రామీణ జనాభా 66213. రాజకీయాలు: ఈ మండలము బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. రవాణా సౌకర్యాలు: జానకంపేట జంక్షన్ నుంచి బోధన్ వరకు రైలుమార్గం ఉంది. బోధన్ నుంచి నిజామాబాదు, బాన్సువాడ, నాందేడ్‌లకు రహదారి మార్గం ఉంది. జిల్లా కేంద్రం నుంచి 45కిమీ దూరంలో ఉంది. మండలంలోని గ్రామాలు: Achampalle (R), Amdapur, Bardipur, Bhandarpally, Bhavanipet, Bhiknalli, Bodhan (U), Bodhan (R), Erajpally, Fathepur, Hangarga, Hunsa, Jadijamalpur, Kaldurthi, Khajapur, Khandgaon, Komanpally, Kopperga, Ladmavandi, Lakmapur, Langadapur, Machapur, Mandharna, Mavandi (Kalan), Mavandi (Khurd), Minarpally, Mithapur, Naganpally, Nagora, Narsapur, Ootpally, Pegadpally, Penta Kalan, Penta Khurd, Rampur, Salampad, Saloora, Sangam, Siddapur, Taggelli ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
14, జూన్ 2019, శుక్రవారం
బోధన్ మండలం (Bodhan Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి