5, జనవరి 2017, గురువారం

జాతీయ వార్తలు 2017 (National News 2017)

జాతీయ వార్తలు 2017 (National News 2017)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2017ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
  • జనవరి 1: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్. అధ్యక్ష పదవి నుంచి ములాయం సింగ్ యాదవ్ తొలగింపు.
  • జనవరి 3: జాతీయ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు తిరుపతిలో ప్రారంభం.
  • జనవరి 3: త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌కు బసవకృషి పురస్కారం లభించింది.
  • జనవరి 3: UPSC చైర్మెన్‌గా డేవిడ్ సిమ్లిహ్‌ నియమితులైనారు.
  • జనవరి 4: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఎన్నికలు జరుగుతాయి.
  • జనవరి 4: భారత 44వ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జగదీశ్ సింగ్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేశారు. 
  • జనవరి 6: 2018-19 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనోజ్ చక్రవర్తి ఎంపికయ్యారు.
  • జనవరి 6: బాలివుడ్ నటుడు ఓంపురి మరణం. 
  • జనవరి 12: ఛత్తీస్‌గఢ్‌లో దుర్గ్ జిల్లా భిలాయ్‌లో జయంతి స్టేడియంలో ఒకేచోట లక్షకుపైగా మంది యోగాసనాలు చేశారు.
  • జనవరి 12: టాటా సన్స్ చైర్మెన్‌గా నటరాజన్ చంద్రశేఖర్ (టీసీఎస్ సీఈఓ).
  • జనవరి 14: పంజాబ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా మరణం 
  • జనవరి 15: 62వ ఫిలింఫేర్ అవార్డులు- ఉత్తమచిత్రం (దుంగల్), ఉత్తమ నటుడు (అమీర్), ఉత్తమ దర్శకుడు (నితేష్ తివారి), ఉత్తమనటి (ఆలియా భట్), ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం (శతృఘ్నుసిన్హా)
  • జనవరి 21: మద్యపానానికి వ్యతిరేకంగా బీహార్‌లో 38 జిల్లాలలో 11292 కిమీల మానవహారం ఏర్పాటై రికార్డు సృష్టించింది
  •  జనవరి 21: గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కగ్వార్‌లో 3.5 లక్షల మంది ఏకకాలంలో జాతీయగీతాన్ని ఆలపించి రికార్డు సృష్టించారు
  • జనవరి 21: తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు వీలుగా గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేశారు.
  • జనవరి 26: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 89 మందికి పద్మ అవార్డులు ప్రధానం చేశారు.
  • జనవరి 26: ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో భారత్ 6వ స్థానంలో నిలిచింది.
  • జనవరి 26: లైంగిక వేధింపుల ఆరోపణపై మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ రాజీనామా చేశారు. 
  • జనవరి 30: భారతీయ కళాకారుడు వి.ఎస్.గైటోండే కళాఖండం 29.3 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.
ఫిబ్రవరి 2017:
  • ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది.
  • ఫిబ్రవరి 4: పంజాబ్, గోవాలలో శాసనసభ ఎన్నికలు జరిగాయి.
  • ఫిబ్రవరి 5: శశికళ అన్నాడీఎంకె శాసనపక్ష నేతగా ఎన్నికయ్యారు.
  • ఫిబ్రవరి 8: కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ధిక్కారణ నోటీసు పంపింది.
  • ఫిబ్రవరి 11: దేశంలోనే తొలి జెట్ ఇంజన్ శ్రేణిని అభివృద్ధిపర్చినట్లు బెంగుళూరుకు చెందిన ఇంటెక్ డీఎంఎస్‌ఎల్ సంస్థ ప్రకటించింది
  • ఫిబ్రవరి 13: అసోచామ్‌ అధ్యక్షుడిగా సందీప్ జజోడియా నియమితులైనారు
  • ఫిబ్రవరి 14: అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విదించింది. జయలలితతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిలను కోర్టు దోషులుగా పేర్కొంది.
  • ఫిబ్రవరి 14: అన్నా డీఎంకె కొత్త శాసనసభపక్ష నేతగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికయ్యారు
  • ఫిబ్రవరి 15: ఇస్రో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది
  • ఫిబ్రవరి 16: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కే. పళనిస్వామి నియమితులైనారు.
  • ఫిబ్రవరి 19: నాగాలాండ్ ముఖ్యమంత్రి టి.ఆర్.జెలియాంగ్ రాజీనామా చేశారు.
  • ఫిబ్రవరి 19: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ మరణించారు 
  • ఫిబ్రవరి 21: టాటా సన్స్ చైర్మెన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించాడు
  • ఫిబ్రవరి 22: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా షుర్హోజెలీ లీజిత్సు అధికారం స్వీకరించాడు 
  • ఫిబ్రవరి 23: RSS సీనియర్ ప్రచారక్ హల్దేకర్‌జీ మరణం
  • ఫిబ్రవరి 24: కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ ప్రాంగణంలొ 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడి ఆవిష్కరించారు 
మార్చి 2017:
  • మార్చి 8: ముంబాయి మేయర్‌గా విశ్వనాథ్ మహదేశ్వర్ (శివసేన) ఎన్నికయ్యారు
  • మార్చి 9: కర్ణాటకలోని కార్వార్ తీరంలోని నౌకా స్థావరంలో INS తిలాన్‌ఛాంగ్ జలప్రవేశం
  • మార్చి 11: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో భాజపా విజయం. పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం. గోవా, మణిపూర్ లలో అస్పష్ట మెజారిటి 
  • మార్చి 13: కేంద్రరక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా
  • మార్చి 14: గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణం (అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్టిక)
  • మార్చి 15: మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరెన్ సింగ్ (భాజపా) ప్రమాణస్వీకారం
 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

జూలై 2017:

ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:

నవంబరు 2017:

డిసెంబరు 2017:


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 20152016

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2017 National news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక