గుర్రంపోడు నల్గొండ జిల్లాకు చెందిన మండలము.మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలకేంద్రం అక్షాంశరేఖాంశాలు 16.8667° ఉత్తర అక్షాంశం,79.1167° తూర్పు రేఖాశం. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మండలానికి సాగునీరు లభిస్తుంది.
సరిహద్దులు: ఈ మండలం భౌగోళికంగా నల్గొండ జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన చండూర్, కనగల్ మండలాలు, తూర్పున హాలియా మండలం, ఆగ్నేయన పెద్దవూర మండలం, ద్క్షిణాన పెద్ద ఆదిశర్లపల్లి మండలం, నైరుతిన కొండమల్లేపల్లి మండలం, పశ్చిమాన నాంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: Amaloor, Bollaram patti Kopp, Chamled, Chepur, Chinthaguda, Gurrampodu, Junuthala, Kacharam patti Kop, Kalwapalli, Kondapur, Koppole, Kothalapur, Mailapur, Makkapalli, Mosangi, Mulkalapalli, Nadikuda, Pallipahad, Palwai, Parlapalli, Pochampalli, Shakajipur, Sulthanpuram, Thanedarpally, Thenepally, Utlapalli, Vattikodu. ప్రముఖ గ్రామాలు పాల్వాయి (Palwai): ఈ గ్రామంలో పురాతన శిలాలయం ఉంది. ఫిబ్రవరి 2011లో గ్రామంలో కాకతీయుల కాలం నాటి శిలాశాసనం వెలుగుచూసింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Gurrampode Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి