10, జూన్ 2018, ఆదివారం

నల్గొండ మండలం (Nalgonda Mandal)

 నల్గొండ మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ నల్గొండ
అసెంబ్లీ నియోజకవర్గంనల్గొండ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
నల్గొండ జిల్లాకు చెందిన మండలము. మండలంలో ఒక పురపాలక సంఘం, 30 రెవెన్యూ గ్రామాలు, 23 గ్రామపంచాయతీలు ఉండగా జిల్లాల పునర్విభజన సమయంలో తిప్పర్తి, కనగల్ మండలాల నుంచి రెండేసి గ్రామాలను ఈ మండలంలో కలిపారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 199325. ప్రసిద్ధి చెందిన ఛాయాసోమేశ్వరాలయం, ఉదయసముద్రం చెరువు ఈ మండలంలో కలవు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కాంచనపల్లి చినరామారావు ఈ మండలానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన నార్కెట్‌పల్లి, కట్టంగూరు మండలాలు, తూర్పున తిప్పర్తి మండలం, దక్షిణాన కనగల్ మండలం, పశ్చిమాన మునుగోడు మండలం, ఈశాన్యాన నక్రేకల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 163382. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 199325. ఇందులో పురుషులు 99922, మహిళలు 99403. పట్టణ జనాభా 153736, గ్రామీణ జనాభా 77088. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 80.03%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో ప్రథమ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నల్గొండ మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. జిల్లాకేంద్రం నల్గొండలో రైల్వేస్టేషన్ ఉంది. 65వ నెంబరు జాతీయ రహదారి నల్గొండ మండలం ఉత్తర భాగం నుంచి నార్కెట్‌పల్లి, కట్టంగూరు మండలాల మీదుగా వెళ్ళుచున్నది. నల్గొండ నుంచి హైదరాబాదు, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేటలకు బస్సుసౌకర్యం చక్కగా ఉంది,

మండలంలోని గ్రామాలు:
Ammaguda, Anantharam, Annareddyguda, Anneparthy, Appaji Peta, Arjalabavi, Buddaram, Chandampalli, Charlapalli, Dandempalli, Donakal, .Chennaram, Gandhamvarigudem, Gollaguda, Gundlapalli, Guttakindi Annaram, Kakula Kondaram, Kanchanpalle, Khazi Ramaram, Khudavanpur, Kothapalli, Maldivari, Domalapa, Mamillaguda, Marriguda, Mella Duppalapalli, Mushampalli, Nalgonda, Narsingbhatla, Panagallu, Puttavari Domalapal, Rasoolpur, Sheshammaguda, Suraram, Thoragal, Velugupalli
ప్రముఖ గ్రామాలు
పానగల్లు (Panagal):
పానగల్లు నల్గొండ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామము. ఇది తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మకమైన గ్రామము. ఇచ్చట 10 వ శతాబ్దికి చెందిన పురాతనమైన సోమేశ్వరాలయం ఉంది. ఇది కాకుండా అనేక ప్రాచీన ఆలయాలకు ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవాది, విప్లవకారుడు మరియు మానవతావాది అయిన కాంచనపల్లి చినరామారావు ఈ గ్రామంలోనే జన్మించారు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ

ఛాయా సోమేశ్వరాలయం

ఉదయ సముద్రం, నల్గొండ
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  నల్గొండ మండలము, నల్గొండ రెవెన్యూ డివిజన్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Udaya samudram, Chaya Someshwar temple, Panagal Temple, Nalgonda Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక