తొగుట సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేరింది. రాష్ట్రమంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన దుబ్బాక మండలం మరియు సిద్ధిపేట గ్రామీణ మండలం, ఈశాన్యాన సిద్ధిపేట పట్టణ మండలం, తూర్పున కొండపాక మండలం, దక్షిణాన గజ్వేల్ మండలం, నైరుతిన రాయిపోల్ మండలం మరియు దౌల్తాబాదు మండలం, పశ్చిమాన మిర్‌దొడ్డి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాకఅసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని గ్రామాలు: ఎలిగడ్డకిస్టాపూర్, ఎల్లారెడ్డిపేట, కనగల్, గుడికందుల, ఘన్‌పూర్, చందాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, తుక్కాపూర్, తొగుట, పల్లిపహాడ్, పి మాసాన్‌పల్లి, బండారుపల్లి, లింగంపేట్, లింగాపూర్, వెంకట్రావుపేట్, వేములఘాట్
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
తుక్కాపూర్ (Tukkapur): తుక్కాపూర్ సిద్ధిపేట జిల్లా తొగుట మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్రమంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Thoguta Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి