నల్లబెల్లి వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. యశోద ఆసుపత్రుల వ్యవస్థాపకులైన గోరుగంటి కుటుంబం ఈ మండలానికి చెందినది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మండలంలో రంగరాయచెరువు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి దక్షిణాన ఖానాపూర్ మండలం మరియు నర్సంపేట మండలం, పశ్చిమాన ఆత్మకూరు మండలం, నైరుతిన దుగ్గొండి మండలం, ఉత్తరాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తూర్పున మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38280. ఇందులో పురుషులు 19317, మహిళలు 18963.
రాజకీయాలు:
ఈ మండలము నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2004లో నర్సంపేట నుంచి విజయంసాధించిన కంబంపాటి లక్ష్మారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ఉడుగుల సునీత, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన పెద్ది స్వప్న ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Arshanpalli, Asaravelli, Govindapur, Gundlapahad, Kannaraopet, Kondapur, Lenkalpalli, Medapalli, Muchimpula, Nagrajpalli, Nallabelly, Nandigama, Narakkapet, Rampur, Ramteertham, Rangapuram, Relakunta , Rudragudem, Shanigaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గోవిందాపురం (Govindapuram): గోవిందాపురం వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ రంగరాయచెరువు ఉంది. చెరువుపై రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి మండలాలలోని 32 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. 2009 ఫిబ్రవరి 22న అప్పటి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభోత్సవం చేశారు. కొండాపూర్ (Kondapur): కొండాపూర్ వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలమునకు చెందిన గ్రామము. గ్రామ జనాభా 700. వీరిలో అత్యధికులు గిరిజనులు. 2006-11 కాలంలో వాసం కన్నయ్య గ్రామ సర్పంచిగా పనిచేశారు. 2007లో గ్రామంలో మద్యనిషేధానికి అంకురార్పణ జరిగింది. గూగుల్ సంస్థ వారు రూ.5 లక్షల పురస్కారాన్ని ఈ గ్రామం పొందింది. మేడిపల్లి (Medipalli): మేడిపల్లి వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలమునకు చెందిన గ్రామము. యశోద ఆసుపత్రుల వ్యవస్థాపకులైన గోరుగంటి కుటుంబం ఈ గ్రామానికి చెందినది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nallabelli Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి