11, జులై 2020, శనివారం

పర్వతనేని ఉపేంద్ర (Parvathaneni Upendra)

జననంజూలై 14, 1936
రంగంజర్నలిస్టు, రాజకీయాలు
పదవులుకేంద్రమంత్రి,
మరణంనవంబరు 16, 2009
జర్నలిస్టుగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన పర్వతనేని ఉపేంద్ర జూలై 14, 1936న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరులో జన్మించారు. ఈయన పూర్తిపేరు ఉపేంద్ర చంద్ర చౌదరి. విద్యార్థిదశలోనే 13వ ఏట స్వగ్రామంలో "విద్యార్థి విజ్ఞాన వికాస మండలిని స్థాపించారు. కళాశాల దశలో ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1957లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో డిప్లోమా పొంది కొంతకాలం "ది మెయిల్" ఆంగ్ల దినపత్రిక ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రైల్వేలో జర్నలిస్టుగా చేరి "ఇండియన్ రైల్వేస్" మాసపత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. 1977లో అప్పటి రైల్వేశాఖ మంత్రి మధుదండావతె కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఉపేంద్ర నవంబరు 16, 2009న హైదరాబాదులో మరణించారు. పారిశ్రామికవేత్త మరియు విజయవాడ ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ ఈయన అల్లుడు (కూతురు పద్మశ్రీ భర్త)

రాజకీయ ప్రస్థానం:
1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఉపేంద్ర 1983లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడమే కాకుండా పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావుకు ప్రత్యేక సలహాదారునిగా పనిచేశారు. 1983లో హిమాయత్ నగర్ ఉప ఎన్నికలో తెలుగుదేశం ఫార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 1984లో తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1992లో తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురై కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1982-92 కాలపు తన రాజకీయ చరిత్రను "గతం-స్వగతం" పేరుతో గ్రంథస్థం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్తీలో చేరి 1996, 98లలో విజయవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికైనారు. 1999లో తెలుగుదేశం ఫార్టీ చేతిలో ఓటమి చెందారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక