ఏలూరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నగరము. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానకేంద్రంగా ఉన్న ఏలూరు ఎంతో ఘనచరిత్రను కల్గియుంది. ఆంధ్రదేశాన్ని పాలించిన పలు రాజ్యాలకు ఏలూరు సమీపంలోని వేంగీ రాజధానిగా పనిచేసింది. 2011 ప్రకారం ఏలురు జనాభా 2.14 లక్షలు. 2005లో ఇది నగరపాలక సంస్థగా మారింది. కథకుడు బుచ్చిబాబు, సినీనటి సిల్క్ స్మిత, నటుడు నాగశౌర్య ఏలూరుకు చెందినవారు. ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం, పామాయిల్ పరిశోధన కేంద్రం ఉన్నాయి. భౌగోళికం: ఏలూరు 16.7 డి ఉతర అక్షాంశం, 81.1డి తూర్పు రేఖాంశంపై ఉంది. కోస్తా ప్రాంతంగా భాగంగా ఉన్న ఏలూరు నగరం సముద్రం నుంచి 50 కిమీ దూరంలో కృష్ణానది మరియు గోదావరి నదుల మధ్యలో ఉంది. చెన్నై-కోల్కతలను కల్పు జాతీయ రహదారి సంఖ్య 16 ఏలూరు మీదుగా వెళ్ళుచున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏలూరు జనాభా 2.14 లక్షలు. జనాభాలో ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌లో 11వ స్థానంలో ఉంది. చరిత్ర: ప్రాచీనకాలంలో ఏలూరు హేలపురంగా పిల్వబడింది. శాలంకాయనులు గురించి తెల్పే చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఏలూరు ప్రాకృత శాసనాన్ని విజయదేవవర్మ వేయించాడు. 15వ శతాబ్ది వరకు ఏలూరు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత గజపతుల నుంచి శ్రీకృష్ణదేవరాయల అధీనంలోకి వచ్చింది. అటుపిమ్మట గోల్కొండ సుల్తానులు, మొఘలులు, హైదరాబాదు నిజాంల నుంచి బ్రిటీష్ వారి అధీనంలోకి మద్రాసు ప్రావిన్సులో భాగమైంది. స్వాతంత్ర్యానంతరం కూడా మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండి, 1953లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రలో భాగమైంది. 1956-2016 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉంది.
రాజకీయాలు: ఏలూరు నగరం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 1957లో లోకసభకు ఎన్నికైన తొలి తెలుగు మహిళా ఎంపి వేదకుమారి ఏలూరు నుంచి ఎన్నికైంది. 2019లో ఏలూరు లోక్‌సభ నుంచి వైకాపాకు చెందిన కోటగిరి శ్రీధర్ ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ: 1866లో బ్రిటీష్ వారి కాలంలో పురపాలక సంఘంగా ఏర్పడి, 2005లో కార్పోరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఏలూరు కార్పోరేషన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. నగర అభివృద్ధి కార్పోరేషన్ ద్వారా జరుగుతోంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
21, ఆగస్టు 2020, శుక్రవారం
ఏలూరు (Eluru)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి