కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో అటవీప్రాంతం ఉంది. బుర్దారంగుట్టలో జ్వాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు పినపాక మండలంలో ఉన్న 9 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున పినపాక మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన ఆల్లపల్లి మండలం, ఉత్తరాన ములుగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
రాజకీయాలు:
ఈ మండలం పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో కారకగూడెం మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన రేగా కాళిక ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anantharam, Bhattupalli, Chirumalla, Kalvalanagaram, Karakagudem, Mothe(PM), Regalla, Samathbhattupalli, Samathmothe
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మోతె (Mothe): మోతె భద్రాద్రి కొత్తగూడెం మండలం కరకగూడెం మండలమునకు చెందిన గ్రామము. 2017లో మోతె గ్రామం వద్ద రూ.10కోట్ల రూపాయలతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించబడింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Karakagudem Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి