మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో
కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. . భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం త్రికోణాకారంలో ఉంది. ఈశాన్యాన చర్ల మండలం, దక్షిణాన అశ్వాపురం మండలం, పశ్చిమాన ఆల్లపల్లి మండలం, వాయువ్యాన పినపాక మండలం సరిహద్దులుగా ఉన్నాయి. ఈశాన్య సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42835. ఇందులో పురుషులు 21635, మహిళలు 21200.
రాజకీయాలు:
ఈ మండలం పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో పినపాక నుంచి వైకాపా తరఫున శాసనసభకు ఎన్నికైన పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలం సమితిసింగారం గ్రామానికి చెందినవారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షురాలిగా తెరాసకు చెందిన కారం విజయకుమారి, జడ్పీటీసిగా పోశం నర్సింహారావు ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annaram, Antharam, Chinnaravigudem, Gundlasingarm, Mallaram, Manuguru, Peddipalli, Ramanujavaram, Samathsingaram, Tirumalapuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మణుగూరు (Manuguru): మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పట్టణము, మండల కేంద్రము మరియు పురపాలక సంఘము. ఇక్కడ భారజల కర్మాగారం ఉంది. గ్రామం గోదావరి నది తీరాన ఉంది. సింగరేణి ఉద్యోగులు ఈ గ్రామంలో అధికసంఖ్యలో నివశిస్తారు. పిన్‌కోడ్ సంఖ్య 507117. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 32వేలు. సమితిసింగారం (Samithisingaram): సమితిసింగారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలమునకు చెందిన గ్రామము. 2014లో పినపాక అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా తరఫున శాసనసభకు ఎన్నికైన పాయం వెంకటేశ్వర్లు ఈ గ్రామానికి చెందినవారు. 2018లో రేగా కాంతారావు చేతిలో ఓడిపోయారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Manuguru Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి