పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. జానంపేటలో శాండ్ రీచ్ ప్రాజెక్ట్ ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలంలోని 9 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా కరకగూడెం మండలాన్ని ఏర్పాటుచేశారు.. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం భౌగోళికంగా జిల్లాలో ఉత్తరాన ములుగు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున చెర్ల మండలం, దక్షిణాన మరియు ఆగ్నేయాన మణుగూరు మండలం, పశ్చిమాన కరకగూడెం మండలం, నైరుతిన ఆల్లపల్లి మండలం, ఉత్తరాన ములుగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48441. ఇందులో పురుషులు 23776, మహిళలు 24665. (పునర్విణజనకు ముందు)
రాజకీయాలు:
ఈ మండలం పినపాక అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో పినపాక మండల అధ్యక్షులుగా మండల అధ్యక్షుడిగా పగడాల సతీష్ రెడ్డి , జడ్పీటీసిగా తెరాసకు చెందిన గడ్డంపల్లి గాంధీ ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allampalli, Bheemavaram, Bommarajupalli, Chegarsala, Duginepalli, E.Bayyaram, Elchireddypalli, Gaddampalli, Janampeta, Pinapaka, Potlapalli, Sarjathpalli, Seetharampuram, Singireddypalli, Sunnamvarigudem, Uppaka, Veerapuram, Venkatraopeta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Pinapaka Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి