లక్ష్మీదేవిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా ముర్రేడు వాగు ప్రవహిస్తోంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు కొత్తగూడెం మండలంలో ఉన్న 9 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆల్లపల్లి మండలం, తూర్పున పాల్వంచ మండలం, దక్షిణాన కొత్తగూడెం మండలం మరియు చుంచుపల్లి మండలం, పశ్చిమాన టేకులపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
.
రాజకీయాలు:
ఈ మండలము కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
లక్ష్మీదేవిపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bangaruchelaka, Chatakonda, Gattumalla, Gollagudem, Karukonda, Kunaram, Laxmidevipally, Punukuduchelaka, Regalla
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
లక్ష్మీదేవిపల్లి (Laxmidevipalli): లక్ష్మీదేవిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం కొత్తగా మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం కొత్తగూడెం మండలంలో భాగంగా ఉండేది. అదే సమయంలో ఇది ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలోకి మారింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Laxmidevipalli Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి