2, సెప్టెంబర్ 2020, బుధవారం

విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand)

జననం
డిసెంబరు 11, 1969
జన్మస్థానం
చెన్నై
రంగం
చెస్ క్రీడాకారుడు
ప్రత్యేకత
భారత తొలి గ్రాండ్‌మాస్టర్
అవార్డులు
పద్మవిభూషణ్, అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్‌రత్న
భారతదేశ ప్రముఖ చెస్ (చదరంగం) క్రీడాకారుడిగా పేరుపొందిన విశ్వనాథన్ ఆనంద్ డిసెంబరు 11, 1969న చెన్నై (తమిళనాడు)లో జన్మించాడు. 1988లోనే గ్రాండ్‌ మాస్టర్ హోదా పొంది ఈ ఘనత వహించిన తొలి భారతీయుడిగా అవతరించాడు. 2006లో 2800 ఎలోరేటింగ్ పొంది ఇందులోనూ తొలి భారతీయుడిగా, ప్రపంచంలో నాల్గవ వ్యక్తిగా అవతరించాడు. 5 సార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన ఆనంద్ 21 మాసాలపాటు ప్రపంచ నెంబర్ వన్‌గా కూడా కొనసాగినాడు. టోర్నమెంట్, మ్యాచ్, నాకౌట్, ర్యాఫిడ్ లలో ప్రపంచ చాంప్ పొందిన ఏకైక చెస్ క్రీడాకారుడుగా రికార్డు సృష్టించాడు.
 
రష్యన్ల ఆధిపత్యం కల్గిన చెస్ క్రీడలో భారత్ తరఫున వెలుగు వెలిగించిన ఆనంద్ ర్యాపిడ్ చెస్‌లో కూడా నిపుణత చూపి లైటింగ్ కిడ్‌గా పేరుపొందడమే కాకుండా 2003, 2017లలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంప్ సైతం సాధించాడు.
 
చదరంగం క్రీడలో ఆనంద్ చూపిన ప్రతిభ మరియు దేశానికి తెచ్చిన కీర్తికై పలు పురస్కారాలు లభించాయి. 1991-92లో తొలి సారి ప్రధానం చేసిన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం ఆనంద్ పొందాడు. అప్పటి నుంచి మరే చెస్ క్రీడాకారునికి ఈ పురస్కారం లభించలేదు. 1985లో అర్జున అవార్డు కూడా పొందాడు. భారత ప్రభుత్వం నుంచి 1987లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్, 2007లో పద్మవుభూషణ్ పురస్కారం స్వీకరించాడు. 1987లో సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, 1997, 1998, 2003, 2004, 2007 & 2008లలో చెస్ ఆస్కార్ అవార్డులు పొందాడు. స్పోర్ట్స్ స్టార్ చే 1995లో బెస్ట్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా, 2012లో ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ మరియు స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గుర్తింపులు పొందాడు. 
 
 


హోం
విభాగాలు: భారతదేశ చెస్ క్రీడాకారులు, తమిళనాడు ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక