ఆల్వాల్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగముగా ఉన్నది. మండలం గుండా సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం మల్కాజ్‌గిరి మండలంలో ఉన్న 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన షామీర్‌పేట మండలం, తూర్పున కాప్రా మండలం, దక్షిణాన మల్కాజ్‌గిరి మండలం మరియు హైదరాబాదు జిల్లా, నైరుతిన బాలానగర్ మండలం, పశ్చిమాన కుత్బుల్లాపూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని గ్రామాలు:
Alwal, Lothukunta, Dammaiguda, Macha Bollaram, Farzanguda, Akbarja, Turkapally, Kowkoor, Mahadevpur, Yapral
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: ఆల్వాల్ (Alwal):ఆల్వాల్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. 2006 వరకు ఇది పురపాలక సంఘంగా ఉండేది. 2006లో ఇది గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగమైంది. 2016 వరకు రంగారెడ్డి జిల్లాలో ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో చేరింది. ఆల్వాల్‌లో రైల్వే స్టేషన్ ఉంది. యాప్రాల్ (Yapral): యాప్రాల్ మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలో భాగము. ఆల్వాల్ పురపాలక సంఘం పరిధిలో ఉంటూ 2007లో గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్‌లో భాగమైంది. ప్రస్తుతం GHMCలో మాల్కాజ్‌గిరి సర్కిల్‌లో నేరెడ్‌మెట్ డీవిజన్‌లో భాగంగా ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి