కీసర మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. మండలకేంద్రం కీసరలో పురాతనమైన "శ్రీరామలింగేశ్వరస్వామి" గా పేరుపొందిన త్రేతాయుగం నాటి శివాలయం ఉంది. క్రీ.శ.4-7 శతాభ్దాల కాలంలో పాలించిన విష్ణుకుండినులు కీసరగుట్టను సైనిక స్థావరంగా ఉపయోగించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. అక్టోబరు 2020లో కీసర తహసీల్దారు నాగరాజు రూ.కోటి పదిలక్షలు లంచం పుచ్చుకుంటూ ఏసిబికి పట్టుబడి రికార్డు సృష్టించారు. అరెస్ట్ అయి, తర్వాత జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన షామీర్‌పేట మండలం, దక్షిణాన ఘట్‌కేసర్ మండలం, పశ్చిమాన కాప్రా మండలం, తూర్పున యాదాద్రి భునవగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 197145. ఇందులో పురుషులు 102191, మహిళలు 94954. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 176019. ఇందులో పురుషులు 89606, మహిళలు 86413. అక్షరాస్యుల సంఖ్య 141005. పట్టణ జనాభా 148765, గ్రామీణ జనాభా 27254. రాజకీయాలు: ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో కీసర మండల జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి బెస్త వెంకటేశ్ గెలుపొందారు. 2019లో ఎంపీటీసిలుగా ముగ్గురు తెరాస అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి, నలుగురు ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు:
Ahmedguda, Bogaram, Cheeryal, Dharmaram, Godumakunta, Haridaspally, Keesara, Keesara Daira, Keshavapur, Kundanpally, Nagaram, Narsampally, Rampally, Thimmaipally, Yadgarpally (East), Yadgarpally (West)
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .చీర్యాల్ (Cheeryal): చీర్యాల్ మేడ్చల్ జిల్లా కీసర మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది మండల కేంద్రమైన కీసర నుంచి 8 కిమీ దూరంలో ఉంది. చీర్యాల్‌లో రీ లక్ష్మీనృసింహ్మస్వామి ఆలయం ఉంది. కీసర (Keesara): కీసర మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ పురాతనమైన "శ్రీరామలింగేశ్వరస్వామి" గా పేరుపొందిన త్రేతాయుగం నాటి శివాలయం ఉంది. క్రీ.శ.4-7 శతాభ్దాల కాలంలో పాలించిన విష్ణుకుండినులు కీసరగుట్టను సైనిక స్థావరంగా ఉపయోగించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు. నాగారం (Nagaram): నాగారం మేడ్చల్ జిల్లా కీసర మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పురపాలక సంఘంగా ఉంది. ఈసీఐల్, పోచారం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉంది. ECIL నుంచి కీసరగుట్ట మార్గం నాగారం మీదుగా వెళ్ళుచున్నది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Keesara Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి