ఖమ్మం పట్టణ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు కలవు. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు ఖమ్మం నగరపాలక సంస్థలో భాగము.ఖమ్మం నగరం మధ్యలో ఎత్తయిన కొండపై ఖమ్మంకోట ఉంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున రఘునాథపల్లి మండలం, దక్షిణాన చింతకాని మండలం, పశ్చిమాన ఖమ్మం గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 313490. ఇందులో పురుషులు 155638, మహిళలు 157852.
ఖమ్మం పట్టణ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Ballepally, Bhuranpuram, Dhamsalapuram, Dhanavaigudem, Khammam, Khanapuram (Haveli), Mallemadugu, Papakabanda, Velugumatla
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు: ఖమ్మం (Khammam):ఖమ్మం తెలంగాణకు చెందిన ప్రముఖ నగరాలలో ఒకటి. దీని ప్రాచీన నామం స్తంభాద్రి. ఆ అర్వాత ఖమ్మముమెట్టుగా పిల్వబడి చివరికి ఖమ్మంగా స్థిరపడింది. నగరంలో నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయం ఉంది. నగరంలోని చారిత్రక ఖమ్మంకోట పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది. మున్నేరునది ఖమ్మం పశ్చిమదిశ నుంచి ప్రవహిస్తోంది. నగరపాలన ఖమ్మం నగరపాలక సంస్థచే జరుగుతుంది. ఇది 2012లో పురపాలక సంఘం నుంచి అప్‌గ్రేడ్ చేయబడింది. మల్లెమడుగు (Mallemadugu): మల్లెమడుగు ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణ మండలమునకు చెందిన గ్రామము. ఇది ఖమ్మం కార్పోరేషన్‌లో భాగంగా ఉంది. మల్లెమడుగులో రైల్వేస్టేషన్ ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Khammam Urban Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి