తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నరుగా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ జూన్ 2, 1961న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జన్మించారు. తమిళనాడుకు చెందిన భాజపా నాయకురాలిగా పేరుపొందిన తమిళిసై ప్రారంభంలో వైద్యవృత్తి చేపట్టి అనంతరం రాజకీయాలలో ప్రవేశించారు. తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా పనిచేస్తూ సెప్టెంబరు 2019లో తెలంగాణ గవర్నరుగా నియమితులైనారు. తమిళిసై తండ్రి అనంతన్ కూడా రాజకీయ నాయకులుగా ప్రసిద్ధి. భర్త సౌందరరాజన్ ప్రముఖ వైద్యులుగా పేరుపొందారు. రాజకీయ ప్రస్థానం: చిన్న వయస్సు నుంచే తమిళిసై రాజకీయాలపై దృష్టిసారించారు. తండ్రి ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నందున రాజకీయ వాతావరణంలో పెరిగారు. కళాశాల విద్య దశలోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికైనారు. తండ్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్ననూ ఈమె భారతీయ జనతా పార్టీ సంబంధిత విభాగాలలో పనిచేశారు. భాజపా అనుబంధ విభాగాలలో పేరుపొంది అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో తమిళనాడు భాజపా అధ్యక్ష పదవిని పొందారు. 2019 సాధారణ ఎన్నికలలో తూతూకుడి నుంచి భాజపా తరఫున పోటీచేసి ఎం.కరుణానిధి కూతురు, డిఎంకె అభ్యర్థి అయిన కనిమొళి చేతిలో ఓడిపోయారు. 2019 సెప్టెంబరులో తెలంగాణ రాష్ట్ర రెండో గవర్నరుగా, తొలి మహిళా గవర్నరుగా నియమితులైనారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
6, అక్టోబర్ 2020, మంగళవారం
తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి