మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగముగా ఉన్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా ఆల్వాల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆల్వాల్ మండలం, తూర్పున కాప్రా మండలం, దక్షిణాన ఉప్పల్ మండలం, పశ్చిమాన హౌదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 287069. ఇందులో పురుషులు 146408, మహిళలు 140661. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 414530. ఇందులో పురుషులు 209591, మహిళలు 204939. అక్షరాస్యుల సంఖ్య 332143. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. అక్షరాస్యత శాతం 88.27%. రాజకీయాలు: ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదులో వార్డు సంఖ్య 8 & 140లో ఉంది. మల్కాజ్‌గిరి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:మల్కాజ్‌గిరి, అమ్ముగూడ
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .అమ్ముగూడ (Ammuguda): అమ్ముగూడ మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి మండలమునకు చెందిజ రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 8). బొల్లారం-సికింద్రాబాదు మార్గంలో అమ్ముగూడ రైల్వేస్టేషన్ ఉంది. మల్కాజ్‌గిరి (Malkajgiri): మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండలకేంద్రము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 140, సర్కిల్ 28). 2007లో GHMCలో విలీనం చేయుటకు ముందు మల్కాజ్‌గిరి పురపాలక సంఘంగా ఉండేది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన మేడ్చల్ జిల్లాలో కలిసింది. సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో మల్కాజ్‌గిరిలో రైల్వేస్టేషన్ ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Malkajgiri Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి