మేడ్చల్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు. 44వ నెంబర్ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. దిగంబరకవిగా పేరుపొందిన విప్లవకవి చెరబండరాజు, రాష్ట్రమంత్రిగా పనిచేసిన ఉమావెంకట్రాంరెడ్డి ఈ మండలానికి చెందినవారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున షామీర్‌పేట మండలం, దక్షిణాన మరియు నైరుతిన దుండిగల్ గండిమైసమ్మ మండలం, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా, ఉత్తరాన మెదక్ మరియు సిద్ధిపేట జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68253. ఇందులో పురుషులు 35039, మహిళలు 33214. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 93091. ఇందులో పురుషులు 47344, మహిళలు 45747. అక్షరాస్యుల సంఖ్య 60723. పట్టణ జనాభా 35638, గ్రామీణ జనాభా 57453. మండలంలోని గ్రామాలు:
Akbarjapet, Athwelli, Bandakunta, Bandamadaram, Dabilpur, Ghanpur, Girmapur, Gosaiguda, Gowdavelli, Gundlapochampally, Kandlakoya, Khajiguda, Konaipally, Maisireddypally, Medchal, Muneerabad, Nuthankal, Pudur, Railapur, Rajbollaram, Ravlkole, Sahajadiguda, Somaram, Srirangavaram, Suthariguda, Velgalkunta, Yellampet
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు: .అత్వెల్లి (Athwelli): అత్వెల్లి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఆర్థికంగా, అధ్యాత్మికంగా, రాజకీయంగా ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఈ గ్రామానికి చెందిన నందారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగురైతు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. డబీల్‌పూర్ (Dabilpur): డబీల్‌పూల్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇక్కడ ఇస్కాన్ నిర్వహణలోని కృష్ణబలరాం ఆలయం ఉంది. మేడ్చల్-మనోహరబాదు సెక్షన్‌లో డబీల్‌పూర్ రైల్వేస్టేషన్ ఉంది. డబీల్‌పూర్ పేరుతో చెరువు కూడా ఉంది. గౌడవెల్లి (Gowdavelli): గౌడవెల్లి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఈ గ్రామానికి చెందిన ఉమావెంకట్రాంరెడ్డి రాష్ట్రమంత్రిగా పనిచేశారు. మేడ్చల్ (Medchal): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము. సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గంలో మేడ్చల్‌లో రైల్వేస్టేషన్ ఉంది. జాతీయ రహదారి నెం.44 కూడా మేడ్చల్ గుండా వెళ్తుంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Medchal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి