మేడ్చల్ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మేడ్చల్ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

6, నవంబర్ 2020, శుక్రవారం

మేడ్చల్ మండలం (Medchal Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్కీసర
అసెంబ్లీ నియోమేడ్చల్
లోకసభ నియోమల్కాజ్‌గిరి
జనాభా
33,514
రెవెన్యూ గ్రామాలు
17
మేడ్చల్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు. 44వ నెంబర్ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. దిగంబరకవిగా పేరుపొందిన విప్లవకవి చెరబండరాజు, రాష్ట్రమంత్రిగా పనిచేసిన ఉమావెంకట్రాంరెడ్డి ఈ మండలానికి చెందినవారు.

అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున షామీర్‌పేట మండలం, దక్షిణాన మరియు నైరుతిన దుండిగల్ గండిమైసమ్మ మండలం, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా, ఉత్తరాన మెదక్ మరియు సిద్ధిపేట జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68253. ఇందులో పురుషులు 35039, మహిళలు 33214. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 93091. ఇందులో పురుషులు 47344, మహిళలు 45747. అక్షరాస్యుల సంఖ్య 60723. పట్టణ జనాభా 35638, గ్రామీణ జనాభా 57453.
 
మండలంలోని గ్రామాలు:
Akbarjapet, Athwelli, Bandakunta, Bandamadaram, Dabilpur, Ghanpur, Girmapur, Gosaiguda, Gowdavelli, Gundlapochampally, Kandlakoya, Khajiguda, Konaipally, Maisireddypally, Medchal, Muneerabad, Nuthankal, Pudur, Railapur, Rajbollaram, Ravlkole, Sahajadiguda, Somaram, Srirangavaram, Suthariguda, Velgalkunta, Yellampet
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు:
.

అత్వెల్లి (Athwelli):
అత్వెల్లి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఆర్థికంగా, అధ్యాత్మికంగా, రాజకీయంగా ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఈ గ్రామానికి చెందిన నందారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగురైతు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
డబీల్‌పూర్ (Dabilpur):
డబీల్‌పూల్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇక్కడ ఇస్కాన్ నిర్వహణలోని కృష్ణబలరాం ఆలయం ఉంది. మేడ్చల్-మనోహరబాదు సెక్షన్‌లో డబీల్‌పూర్ రైల్వేస్టేషన్ ఉంది. డబీల్‌పూర్ పేరుతో చెరువు కూడా ఉంది.
గౌడవెల్లి (Gowdavelli):
గౌడవెల్లి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఈ గ్రామానికి చెందిన ఉమావెంకట్రాంరెడ్డి రాష్ట్రమంత్రిగా పనిచేశారు.
మేడ్చల్ (Medchal):
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము. సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గంలో మేడ్చల్‌లో రైల్వేస్టేషన్ ఉంది. జాతీయ రహదారి నెం.44 కూడా మేడ్చల్ గుండా వెళ్తుంది.

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, మేడ్చల్ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Medchal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

25, జూన్ 2017, ఆదివారం

విభాగము: మేడ్చల్ జిల్లా (Portal: Medchal Dist)

 విభాగము: మేడ్చల్ జిల్లా
(Portal: Medchal Dist)
  1. మేడ్చల్ జిల్లా ప్రముఖులు (Famous Persons of Medchal Dist),
  2. మేడ్చల్ జిల్లా మండలాలు (Mandals in Medchal Dist),
  3. మేడ్చల్ జిల్లా నియోజకవర్గాలు (Constituencies in Medchal Dist),
  4. మేడ్చల్ జిల్లా సందర్శనీయ ప్రదేశాలు (Tourism places in Medchal Dist),
  5. మేడ్చల్ జిల్లా రెవెన్యూ డివిజన్లు (Revenue Divisions in Medchal Dist),
  6. మేడ్చల్ జిల్లా చారిత్రక కోటలు (Forts in Medchal Dist),
  7. మేడ్చల్ జిల్లా నదులు (Rivers in Medchal Dist),
  8. మేడ్చల్ జిల్లా ప్రాజెక్టులు (Projects in Medchal Dist),
  9. మేడ్చల్ జిల్లా దేవాలయాలు (Temples in Medchal Dist),
  10. మేడ్చల్ జిల్లా రైల్వేస్టేషన్లు (Railway Stations in Medchal Dist),
  11. మేడ్చల్ జిల్లా రహదారులు (Road in Medchal Dist), 
  12. మేడ్చల్ జిల్లా పురపాలక సంఘాలు (Muncipalities in Medchal Dist), 
  13. మేడ్చల్ జిల్లా వ్యాసం (Medcha Dist Essay),

హోం,
విభాగాలు:
తెలంగాణ జిల్లాలు,
      Tags:telangana District information in telugu, All about Telangana, TSPSC information, Telangana complete information, mandals in telangana, muncipalities in telanagana, rivers in telangana, historical places in telangana, revenue divisions in telangana,

      22, ఆగస్టు 2016, సోమవారం

      మేడ్చల్ జిల్లా (Medchal District)

      మండలాలు15
      రెవెన్యూ డివిజన్లు2
      వైశాల్యం1084
      జనాభా2440073
      రెవెన్యూ గ్రామాలు
      163
      గ్రామపంచాయతీలు
      61
      మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పాటైన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా గుండా 3 జాతీయ రహదారులు, 3 రైల్వే మార్గాలు వెళ్ళుచున్నాయి. 

      చారిత్రకమైన త్రేతాయుగం నాటి శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈ జిల్లాలో ఉంది. సమరయోధురాలు సంగెం లక్ష్మీబాయమ్మ, వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉమావెంకట్రాంరెడ్డి ఈ జిల్లాకు చెందినవారు.

      మేడ్చల్ జిల్లాలో చాలా భాగం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. అంతేకాకుండా జిల్లాలో 4 నగరపాలక సంస్థలు (పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్), 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

      మండలాలు:
      మేడ్చల్, షామీర్‌పేట్, కీసర, కాప్రా, ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, దుండిగల్ గండిమైసమ్మ, బాచుపల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, మూడుచింతలపల్లి.
       
      చరిత్ర:
      సెప్టెంబరు 17, 1948న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాదు జిల్లాలో భాగంగా హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన పిదప 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయంలో ఈ ప్రాంతం అప్పుడు కొత్తగా అవతరించిన రంగారెడ్డి జిల్లాలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె జయప్రదమైంది. జూన్ 2, 2014లో ఈ ప్రాంతం కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో రంగారెడ్డి జిల్లా నుంచి విడదీసిన 14 మండలాలతో మేడ్చల్ జిల్లా ఏర్పాటైంది. మార్చి 2019లో శామీర్‌పేట మండలాన్ని విభజించి మరో మండలాన్ని (మూడుచింతలపల్లి మండలం) ఏర్పాటుచేశారు. 

      రవాణా సౌకర్యాలు:
      సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం,  కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు-వాడి మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. 7వ నెంబరు (కొత్తపేరు 44), 9వ నెంబరు మరియు 202 నెంబరు జాతీయ రహదారులు కూడా జిల్లాపై నుంచి వెళ్తున్నాయి.
       
      రాజకీయాలు:
      మేడ్చల్ జిల్లాకు చెందిన మండలాలు మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తాయి.


      ఇవి కూడా చూడండి:


      విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా,


       = = = = =


      29, అక్టోబర్ 2020, గురువారం

      ఘట్‌కేసర్ మండలం (Ghatkesar Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోమేడ్చల్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      జనాభా
      188700
      రెవెన్యూ గ్రామాలు
      19
      ఘట్‌కేసర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 మరియు సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం వెళ్ళుచున్నవి. సంగెం లక్ష్మీబాయమ్మ, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 
       
      1978 వరకు హైదరాబాదు జిల్లాలో, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో కొనసాగిన ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.

      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన కీసర మండలం, పశ్చిమాన మేడిపల్లి మండలం, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జాతీయ రహదారి నెం.202 మరియు సికింద్రాబాదు-కాజీపేట రైలుమార్గం జిల్లా గుండా వెళ్తున్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 88935. ఇందులో పురుషులు 45926, మహిళలు 43009. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 188700. ఇందులో పురుషులు 75710, మహిళలు 73055. అక్షరాస్యుల సంఖ్య 124280. పట్టణ జనాభా 138252, గ్రామీణ జనాభా 50448.

      రాజకీయాలు:
      ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
       
      ఘట్‌కేసర్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      Ankushapur, Annojiguda, Aushapur, Badesahebguda, Edulabad, Ghatkesar, Ismailkhanguda, Kachwanisingaram, Kondapur, Korremul, Madharam, Majarguda, Marpallyguda, Muthawalliguda, Narepally, Padamatisaiguda, Pocharam, Prathapsingaram, Yamnampet
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      ఏదులాబాదు (Edulabad):
      ఏదులాబాదు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలానికి చెందిన గ్రామము. ఏదులాబాదు చెరువు మండలంలోనే పెద్దది. దీనిలోకి మూసి, ఎరిమల్లేవాగు నీరు కలుస్తుంది. 2వేల ఎకరలకు నీరు అందిస్తుంది. చెరువులో చేపలుపట్టే 500 కుటుంబాలు జీవనోపాధి పొందుచున్నాయి.
      ఘట్‌కేసర్ (Ghatkesar) :
      ఘట్‌కేసర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. హైదరాబాదు శివారులో, మరియు HMDAలో భాగంగా ఉంది. సమరయోధురాలిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన సంగెం లక్ష్మీబాయమ్మ ఈ గ్రామానికి చెందినవారు.
      కొర్రెముల (Korremula) :
      కొర్రెముల మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఔటర్ రింగ్‌రోడ్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళుచున్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
      మాదారం (Madaram):
      మాదారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.
      పోచారం (Pocharam):
      పోచారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతము మరియు సమీపంలో సింగపూర్ టౌన్‌షిప్, ఇన్ఫోసిస్ కార్యాలయం ఉన్నాయి. విశాలమైన స్థలంలో చెరువు ప్రక్కన స్పటికలింగేశ్వర ఆలయాన్ని గ్రామస్థులు నిర్మించుకున్నారు. గుజరాత్ నుంచి తెప్పించి ప్రతిష్టించిన స్పటికలింగం దక్షిణ భారతదేశంలోనే పెద్దది.
      యనంపేట (Yanampet):
      యనంపేట మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 500 సంవత్సరాల చరిత్ర కల పురాతనమైన శ్రీరంగనాయక, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.



      ఇవి కూడా చూడండి:
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, ఘట్‌కేసర్ మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Ghatkesar Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      6, నవంబర్ 2020, శుక్రవారం

      మేడిపల్లి మండలం (Medipalli Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోమేడ్చల్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      రెవెన్యూ గ్రామాలు
      8
      మేడిపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు ఘట్‌కేసర్ మండలంలో ఉన్న 8 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 వెళ్ళుచున్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని బోడుప్పల్ మరియు పీర్జాదిగూడలు నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి తూర్పున ఘట్‌కేసర్ మండలం, పశ్చిమాన ఉప్పల్ మండలం, ఉత్తరాన కాప్రా మండలం, ఈశాన్యాన కీసర మండలం, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

      రాజకీయాలు:
      ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని బోడుప్పల్ మరియు పీర్జాదిగూడలు నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.
       
      మేడిపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      Bibi shaeb Maqta, Boduppal, Chengicherla, Gulamaliguda, Parvatapur, Peerzadiguda, Medipally, Miyapur
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      బోడుప్పల్ (Boduppal):
      బోడుప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణప్రాంతము. 2016కు ముందు గ్రామపంచాయతీగా ఉన్న బోడుప్పల్ చెంగిచెర్లతో కలిపి పురపాలక సంఘంగా, 2019లో నగరపాలక సంస్థగా మారింది. ఈ ప్రాంతం జాతీయ రహదారి 163పై ఉంది. 2019లో సామల బుచ్చిరెడ్డి తొలి మేయరుగా ఎన్నికైనారు.
      చెంగిచెర్ల (Chengicherla):
      చెంగిచెర్ల మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న చెంగిచెర్ల 2016లో బోడుప్పల్ పురపాలకసంఘంలో కలిసింది. 2019లో బోడుప్పల్ నగరపాలక సంస్థగా మారింది.
      మేడిపల్లి (Medipalli):
      మేడిపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న మేడిపల్లి  2016లో పీర్జాదిగూడ పురపాలకసంఘంలో కలిసింది. ఇది 2019లో నగరపాలక సంస్థగా మారింది. 
      పర్వతాపూర్ (Parvatapur):
      పర్వతాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న పర్వతాపూర్ 2016లో పీర్జాదిగూడ పురపాలకసంఘంలో కలిసింది. ఇది 2019లో నగరపాలక సంస్థగా మారింది. 
      పీర్జాదిగూడ (Peerzadiguda):
      పీర్జాదిగూడ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణప్రాంతము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న పీర్జాదిగూడ 2016లో మేడిపల్లి మరియు పర్వతాపూర్ పంచాయతీలతో కలిపి పురపాలకసంఘంగా, 2019లో నగరపాలక సంస్థగా మారింది.



      ఇవి కూడా చూడండి:

       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, మేడిపల్లి మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Medipalli Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      28, అక్టోబర్ 2020, బుధవారం

      బాలానగర్ మండలం (Balanagar Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
      అసెంబ్లీ నియోకూకట్‌పల్లి & శేరిలింగంపల్లి
      లోకసభ నియోమల్కాజ్‌గిరి,
      చేవెళ్ళ
      జనాభా
      567320
      రెవెన్యూ గ్రామాలు
      8
      (ఇది మేడ్చల్ జిల్లా బాలానగర్ మండల వ్యాసము. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కోసం ఇక్కడ చూడండి)
      బాలానగర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది హైదరాబాదు నగరానికి సమీపంలో ఉంది. మండల పరిధిలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మండలంలో 8  రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం మీదుగా హైదరాబాదు-వాడి రైలుమార్గం, జాతీయ రహదారి నెం.9 (కొత్తపేరు 65) మరియు 7 (కొత్త పేరు 44) వెళ్ళుచున్నాయి. బేగంపేట విమానాశ్రయం ఈ మండలంలో ఉంది.

      రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన కుత్బుల్లాపూర్ మండలం, ఈశాన్యాన ఆల్వాల్ మండలం, వాయువ్యాన కూకట్‌పల్లి మండలం, తూర్పున మరియు దక్షిణాన హైదరాబాదు జిల్లా సరిహద్దుగా ఉంది. మండలం మీదుగా హైదరాబాదు-వాడి రైలుమార్గం, జాతీయ రహదారి నెం.9 (కొత్తపేరు 65) మరియు 7 (కొత్త పేరు 44) వెళ్ళుచున్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 371345. ఇందులో పురుషులు 166327, మహిళలు 151018. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 567320. ఇందులో పురుషులు 291904, మహిళలు 275416.మండలం మొత్తం పట్టణ ప్రాంతమే.

      రాజకీయాలు:
      రాజకీయాలు:
      ఈ మండలం కూకట్‌పల్లి మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా ఉంది. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం పరిధిలోనూ, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఉనాయి. గ్రేటర్ హైదరాబాదులో బాలానగర్ 120వ వార్డులో భాగంగా ఉంది.

       
      మండలంలోని గ్రామాలు:
      Balanagar, Ferozguda, Zinkalawada, Fathenagar, Old bowenpally, Hasmathpet, Begumpet, Babbuguda
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      బాలానగర్ (Balanagar) :
      బాలానగర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది హైదరాబాదు నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో 120వ వార్డులో భాగంగా ఉంది. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.
      బేగంపేట (Begumpet ):
      బేగంపేట మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలోనే ఒక ముఖ్యమైన ప్రాంతము. 6వ నిజాం మహబూబ్‌అలీఖాన్ కూతురు బషీర్ ఉన్నీసా బేగం పేరిట దీనికి ఈ పేరు వచ్చింది. బేగంపేటలో విమానాశ్రయం ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమయ్యే వరకు ఇది హైదరాబాదు విమానాశ్రయంగా పనిచేసింది. సికింద్రాబాదు-వాడి మార్గంలో బేగంపేటలో రైల్వేస్టేషన్ ఉంది.
      ఫతేనగర్ (Fateh Nagar):
      ఫతేనగర్ మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రములు అధికంగా ఉన్నాయి. ఫతేనగర్‌లో MMTS రైల్వేస్టేషన్ ఉంది.
      హష్మత్‌పేట్ (Hasmathpet) :
      హష్మత్‌పేట్ మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలో (సికింద్రాబాదు) భాగంగా ఉంది. చారిత్రక హష్మత్‌పేట్ కైరన్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. బాన్ చెరువు పేరిట ఒక పెద్ద చెరువు కూడా ఉంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా ఈ చెరువులో చేస్తారు.
      ఓల్డ్ బోయిన్‌పల్లి (Old bowenpally):
      ఓల్డ్ బోయిన్‌పల్లి మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది జంటనగరాలలో సికింద్రాబాదు పరిధిలోకి వస్తుంది. 44వ నెంబర్ జాతీయ రహదారి ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. చాళుక్య త్రైలోక్య త్రిభువనమల్ల పేరిట దీనికి భువనపల్లి పేరు వచ్చింది. క్రమేణా బోయిన్‌పల్లిగా మారింది.



      ఇవి కూడా చూడండి:
      • బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport),
      • హైదరాబాదు పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School),
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, బాలానగర్ మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Balanagar Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      7, నవంబర్ 2020, శనివారం

      శామీర్‌పేట్ మండలం (Shamirpet Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోమేడ్చల్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      జనాభా
      117554
      రెవెన్యూ గ్రామాలు
      14
      శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి ఈమండలమునకు చెందినవారు. మండలంలోని పలు గ్రామాలలో కులీకుతుబ్‌షా కాలం నాటి చారిత్రక కట్టడాలున్నాయి. పర్యాటక ప్రాంతంగా పేరుపొందిన శామీర్‌పేట రత్నాలయం, శామీర్‌పేట చెరువు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ, జవహర్ డీర్ పార్క్, జినోమ్‌ వాలీ ఈ మండలంలో ఉన్నాయి.
       
      అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. మార్చి 7, 2019న షామీర్‌పేట మండలంలోని 17 గ్రామాలను విడదీసి కొత్తగా మూడుచింతలపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి పశ్చిమాన మేడ్చల్ మండలం, దక్షిణాన కీసర, కాప్రా, ఆల్వాల్ మండలాలు, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 85291. ఇందులో పురుషులు 43943, మహిళలు 41348. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 117554. ఇందులో పురుషులు 61034, మహిళలు 56520.
       
      శామీర్‌పేట్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      Aliabad, Anthaipally, Bommaraspet, Devaryamjal, Lalgadimalakpet, Majeedpur, Mandaipally, Muraharipally, Ponnal, Pothaipally, Shamirpet, Singaipally, Thumkunta, Turkapally, Yadaram,
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు:
      .
      శామీర్‌పేట్ (Shamirpet):
      శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ రాజీవ్ రహదారి ప్రక్కన ప్రఖ్యాతిగాంచిన రత్నాలయం ఉంది. ఈ ఆలయం 2003లో నిర్మించబడింది. బిట్స్ పిలానీ, నల్సార్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆలయం సమీపంలో పెద్ద చెరువు ఉంది. ఇది శామీర్‌పేట చెరువుగా పేరుపొందింది.
      తుర్కపల్లి (Turkapalli):
      తుర్కపల్లి మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. జూలై 11, 2015 తుర్కపల్లి శివారులో ఆదిమానవుల చిత్రాల బయటపడ్డాయి.



      ఇవి కూడా చూడండి:
      • నల్సార్ విశ్వవిద్యాలయం,
      • శామీర్‌పేట చెరువు
      • శామీర్‌పేట రత్నాలయం,
      • శామీర్‌పేట చెరువు,
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, శామీర్‌పేట్ మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Shamirpet Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      29, అక్టోబర్ 2020, గురువారం

      కాప్రా మండలం (Kapra Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోమేడ్చల్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      రెవెన్యూ గ్రామాలు
      3
      కాప్రా మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అంతకు క్రితం కీసర, శామీర్‌పేట్, ఘట్‌కేసర్ మండలాలలో ఉన్న ఒక్కో గ్రామాన్ని విడదీసి 3 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు..
       
      ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కర్మాగారం, సెంట్రల్ జైలు మండలంలో ఉన్నాయి. మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి తూర్పున కీసర మండలం, దక్షిణాన మేడిపల్లి మండలం, పశ్చిమాన మల్కాజ్‌గిరి మండలం మరియు ఆల్వాల్ మండలం, ఉత్తరాన షామీర్‌పేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

      రాజకీయాలు:
      ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
       
      మండలంలోని గ్రామాలు:
      చెర్లపల్లి, జవహర్‌నగర్, కాప్రా,
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      చెర్లపల్లి (Cherlapally) :
      చెర్లపల్లి మేడ్చల్ జిల్లా కాప్రా మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా కాప్రా సర్కిల్, వార్డు 2లో ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం చెర్లపల్లిలో ఉంది. చెర్లపల్లిలో సెంట్రల్ జైలు, రైల్వేస్టేషన్ కూడా ఉన్నాయి.
      జవహర్‌నగర్ (Cherlapally) :
      జవహర్‌నగర్ మేడ్చల్ జిల్లా కాప్రా మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. BITS హైదరాబాదు క్యాంపస్ ఈ ప్రాంతంలో ఉంది.
      కాప్రా (Kapra):
      కాప్రా మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా (వార్డు నెం.1) ఉంది. కీసర మండలంలో ఉన్న ఈ ప్రాంతం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా మండల కేంద్రంగా మారింది.



      ఇవి కూడా చూడండి:
      • ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL),
      • చెర్లపల్లి సెంట్రల్ జైలు,
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, కాప్రా మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Kpra Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      7, నవంబర్ 2020, శనివారం

      ఉప్పల్ మండలం (Uppal Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోఉప్పల్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      జనాభా
      388750
      రెవెన్యూ గ్రామాలు
      14
      ఉప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 వెళ్ళుచున్నది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు మెట్రోకు చెందిన ఉప్పల్ డీపో ఈ మండలంలో ఉన్నాయి.

      అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. . 
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన మల్కాజ్‌గిరి మండలం, తూర్పున మేడిపల్లి మండలం, పశ్చిమాన హైదరాబాదు జిల్లా, దక్షిణన హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 118085. ఇందులో పురుషులు 61322, మహిళలు 56763. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 388750. ఇందులో పురుషులు 200048, మహిళలు 188702. అక్షరాస్యుల సంఖ్య 313079. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే.
       
      మండలంలోని గ్రామాలు:
      Bandlaguda, Fathullaguda, Habsiguda, Kothapet, Mallapur, Meerpet, Nacharam, Nagole, Navoranguda Bhagayath, Navoranguda Khalsa, Ramanthapur Bagayath , Ramanthapur Khalsa, Uppal Bagayath, Uppal Khalsa
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు:
      .
      బండ్లగూడ (Bandlaguda ):
      బండ్లగూడ మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామం. నవచేతన బుక్ పబ్లిషింగ్ హౌస్, నవ తెలంగాణ దినపత్రిక కార్యాలయం ఇక్కడ ఉన్నాయి.
      నాచారం (Nacharam):
      నాచారం మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలమునకు చెందిన పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 6). పాదరక్షాల (చెప్పుల) పరిశ్రమకు ఈ ప్రాంతం పేరుపొందింది. అలాగే ఫ్యాబ్రికేషన్, టెక్స్‌టైల్స్, టైర్లు, ట్యూబులు, ఫర్నీచరు తదితర ఉత్పత్తులకు చెందిన పరిశ్రమలున్నాయి.
      నాగోల్ (Nagole):
      నాగోల్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలానికి చెందిన పట్టణ ప్రాంతము. 1990 దశకంలో మామూలు ప్రాంతంగా ఉన్న నాగోల్ 2000 దశకంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ అభివృద్ధి చెంది 2010 దశకం నాటికి పూర్తిగా పట్టణప్రాంతంగా మారింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మెట్రోరైలు సదుపాయం కూడా ఉంది. ఉప్పల్ మరియు ఎల్బీనగర్ ప్రాంతాల మధ్యలో ఉంది.
      ఉప్పల్ (Uppal):
      ఉప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణ ప్రాంతము, మండల కేంద్రము మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉంది. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (సర్కిల్ 2). గ్రేటర్‌లో విలీనానికి ముందు ఉప్పల్ పురపాలక సంఘంగా ఉండేది. పురాతనమైన రామాలయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మెట్రోరైల్వేకు చెందిన ఉప్పల్ డిపో ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఉప్పల్ రహదారి కూడలి హైదరాబాదులోని ముఖ్యమైన కూడళ్ళలో ఒకటి.



      ఇవి కూడా చూడండి:
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, ఉప్పల్ మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Uppal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      29, అక్టోబర్ 2020, గురువారం

      కీసర మండలం (Keesara Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      జనాభా
      176019
      రెవెన్యూ గ్రామాలు
      16
      కీసర మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
       
      మండలకేంద్రం కీసరలో పురాతనమైన "శ్రీరామలింగేశ్వరస్వామి" గా పేరుపొందిన త్రేతాయుగం నాటి శివాలయం ఉంది. క్రీ.శ.4-7 శతాభ్దాల కాలంలో పాలించిన విష్ణుకుండినులు కీసరగుట్టను సైనిక స్థావరంగా ఉపయోగించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు.
       
      అక్టోబరు 2020లో కీసర తహసీల్దారు నాగరాజు రూ.కోటి పదిలక్షలు లంచం పుచ్చుకుంటూ ఏసిబికి పట్టుబడి రికార్డు సృష్టించారు. అరెస్ట్ అయి, తర్వాత జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన షామీర్‌పేట మండలం, దక్షిణాన ఘట్‌కేసర్ మండలం, పశ్చిమాన కాప్రా మండలం, తూర్పున యాదాద్రి భునవగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 197145. ఇందులో పురుషులు 102191, మహిళలు 94954. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 176019. ఇందులో పురుషులు 89606, మహిళలు 86413. అక్షరాస్యుల సంఖ్య 141005. పట్టణ జనాభా 148765, గ్రామీణ జనాభా 27254.

      రాజకీయాలు:
      ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో కీసర మండల జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి బెస్త వెంకటేశ్ గెలుపొందారు. 2019లో ఎంపీటీసిలుగా ముగ్గురు తెరాస అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి, నలుగురు ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు.
       
      మండలంలోని గ్రామాలు:
      Ahmedguda, Bogaram, Cheeryal, Dharmaram, Godumakunta, Haridaspally, Keesara, Keesara Daira, Keshavapur, Kundanpally, Nagaram, Narsampally, Rampally, Thimmaipally, Yadgarpally (East), Yadgarpally (West)
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      చీర్యాల్ (Cheeryal):
      చీర్యాల్ మేడ్చల్ జిల్లా కీసర మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది మండల కేంద్రమైన కీసర నుంచి 8 కిమీ దూరంలో ఉంది. చీర్యాల్‌లో రీ లక్ష్మీనృసింహ్మస్వామి ఆలయం ఉంది.
      కీసర (Keesara):
      కీసర మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ పురాతనమైన "శ్రీరామలింగేశ్వరస్వామి" గా పేరుపొందిన త్రేతాయుగం నాటి శివాలయం ఉంది. క్రీ.శ.4-7 శతాభ్దాల కాలంలో పాలించిన విష్ణుకుండినులు కీసరగుట్టను సైనిక స్థావరంగా ఉపయోగించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు.
      నాగారం (Nagaram):
      నాగారం మేడ్చల్ జిల్లా కీసర మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పురపాలక సంఘంగా ఉంది. ఈసీఐల్, పోచారం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉంది. ECIL నుంచి కీసరగుట్ట మార్గం నాగారం మీదుగా వెళ్ళుచున్నది.



      ఇవి కూడా చూడండి:
      • కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం,

       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, కీసర మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Keesara Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      7, నవంబర్ 2020, శనివారం

      కుత్బుల్లాపూర్ మండలం (Qutbullapur Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
      అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
      లోకసభ నియోమల్కాజ్‌గిరి


      రెవెన్యూ గ్రామాలు
      6
      కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. మండల పరిధిలో జీడిమెట్ల, గాజులరామారం పారిశ్రామిక వాడలున్నాయి.
       
      జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం 3 ముక్కలై కొత్తగా రెండు మండలాలు ఏర్పడ్డాయి. ఈ మండలంలోని 10 గ్రామాలను విడదీసి దుండిగల్ గండిమైసమ్మ మండలాన్ని, 2 గ్రామాలతో బాచుపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం రంగారెడ్డీ జిల్లా నుంచి కొత్తగా అవతరించిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన దుండిగల్ గండిమైసమ్మ మండలం, తూర్పున ఆల్వాల్ మండలం, దక్షిణాన బాలానగర్ మండలం, పశ్చిమాన బాచుపల్లి మండలం, నైరుతిన కూకట్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా 44వ నెంబర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 281340. ఇందులో పురుషులు 146712, మహిళలు 134628. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 502932. ఇందులో పురుషులు 260061, మహిళలు 242871.
       
      కుత్బుల్లాపూర్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      Quthbullapur, Gajularamaram, Suraram, Pet Basheerabad, Jeedimetla, Namdarnagar
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు:
      .
      గాజుల రామారం (Gajula Ramaram):
      గాజుల రామారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది మరియు జీడిమెట్ల పారిశ్రామికవాడ సమీపంలో ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధూక్షుడిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన కూన శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రాంతానికి చెందినవారు. 
      జీడిమెట్ల (Jeedimetla):
      జీడిమెట్ల మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఫార్మా, కెమికల్స్ మరియు టెక్స్‌టైల్స్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది.
      కుతుబుల్లాపూర్ (Qutbullapur):
      కుతుబుల్లాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. మొదట గ్రామపంచాయతీగా ఉన్న ఈ పట్టణం 1987 ఫిబ్రవరిలో పురపాలక సంఘంగా మారింది. అప్పుడు పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గాజులరామారం, సూరారం గ్రామాలు ఈ పురపాలికలో విలీనం చేశారు. 2007లో ఈ పురపాలక సంఘం గ్రేటర్ హైదరాబాదులో విలీనమైంది. 1987లో 30 వేల జనాభా ఉన్న పట్టణం ప్రస్తుతం లక్షకుపైగా పెరిగింది. జీడిమెట్ల, గాజులరామారం, గాంధీనగర్ పారిశ్రామిక వాడల ఏర్పాటుతో వలసలు అధికమైనాయి.



      ఇవి కూడా చూడండి:

       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, కుత్బుల్లాపూర్ మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Qutbullapur Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      29, అక్టోబర్ 2020, గురువారం

      దుండిగల్ గండిమైసమ్మ మండలం (Dundigal gandimaisamma Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
      అసెంబ్లీ నియోకుత్బుల్లాపూర్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      రెవెన్యూ గ్రామాలు
      10
      దుండిగల్ గండిమైసమ్మ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (దూలపల్లిలో) ఈ మండలంలోనే ఉంది.

      జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున మేడ్చల్ మండలం, ఆగ్నేయాన ఆల్వాల్ మండలం, దక్షిణాన కుత్బుల్లాపూర్ మండలం మరియు బాచుపల్లి మండలం, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది.
       
      దుండిగల్ గండిమైసమ్మమండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      Kompally, Doolapally, Dundigal, Nagaloor, Bowrampet, Gagilapur, Dommara pochampally, Bahadurpally, Shambipur, Mallampet
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      దూలపల్లి (Doolapalli):
      దూలపల్లి రంగారెడ్డి జిల్లా కుతుబుల్లాపూర్ మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఈ గ్రామంలోనే ఉంది.
      దుండిగల్ (Dundigal):
      దుండిగల్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘంగా ఉంది.
      కొంపల్లి (Kompalli):
      కొంపల్లి మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. ఇది పురపాలక సంఘంగా ఉంది.


      ఇవి కూడా చూడండి:
      • తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి,
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, దుండిగల్ గండిమైసమ్మమండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Dundigal gandimaisamma Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      1, నవంబర్ 2020, ఆదివారం

      మల్కాజ్‌గిరి మండలం (Malkajgiri Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
      అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      జనాభా
      414530
      రెవెన్యూ గ్రామాలు
      2
      మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగముగా ఉన్నది.

      జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా ఆల్వాల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.. 
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి ఉత్తరాన ఆల్వాల్ మండలం, తూర్పున కాప్రా మండలం, దక్షిణాన ఉప్పల్ మండలం, పశ్చిమాన హౌదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 287069. ఇందులో పురుషులు 146408, మహిళలు 140661. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 414530. ఇందులో పురుషులు 209591, మహిళలు 204939. అక్షరాస్యుల సంఖ్య 332143. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. అక్షరాస్యత శాతం 88.27%.

      రాజకీయాలు:
      ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదులో వార్డు సంఖ్య 8 & 140లో ఉంది.
       
      మల్కాజ్‌గిరి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      మల్కాజ్‌గిరి, అమ్ముగూడ
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
      .
      అమ్ముగూడ (Ammuguda):
      అమ్ముగూడ మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి మండలమునకు చెందిజ రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 8). బొల్లారం-సికింద్రాబాదు మార్గంలో అమ్ముగూడ రైల్వేస్టేషన్ ఉంది.
      మల్కాజ్‌గిరి (Malkajgiri):
      మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండలకేంద్రము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 140, సర్కిల్ 28). 2007లో GHMCలో విలీనం చేయుటకు ముందు మల్కాజ్‌గిరి పురపాలక సంఘంగా ఉండేది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన మేడ్చల్ జిల్లాలో కలిసింది. సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో మల్కాజ్‌గిరిలో రైల్వేస్టేషన్ ఉంది.



      ఇవి కూడా చూడండి:

       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, మల్కాజ్‌గిరి మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Malkajgiri Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      Index


      తెలుగులో విజ్ఞానసర్వస్వము
      వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
      ప్రపంచము,
      శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
      క్రీడలు,  
      క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
      శాస్త్రాలు,  
      భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
      ఇతరాలు,  
      జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

          విభాగాలు: 
          ------------ 

          stat coun

          విషయసూచిక