మేడిపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు ఘట్‌కేసర్ మండలంలో ఉన్న 8 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 వెళ్ళుచున్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని బోడుప్పల్ మరియు పీర్జాదిగూడలు నగరపాలక సంస్థలుగా ఉన్నాయి. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఘట్‌కేసర్ మండలం, పశ్చిమాన ఉప్పల్ మండలం, ఉత్తరాన కాప్రా మండలం, ఈశాన్యాన కీసర మండలం, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని బోడుప్పల్ మరియు పీర్జాదిగూడలు నగరపాలక సంస్థలుగా ఉన్నాయి. మేడిపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Bibi shaeb Maqta, Boduppal, Chengicherla, Gulamaliguda, Parvatapur, Peerzadiguda, Medipally, Miyapur
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .బోడుప్పల్ (Boduppal): బోడుప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణప్రాంతము. 2016కు ముందు గ్రామపంచాయతీగా ఉన్న బోడుప్పల్ చెంగిచెర్లతో కలిపి పురపాలక సంఘంగా, 2019లో నగరపాలక సంస్థగా మారింది. ఈ ప్రాంతం జాతీయ రహదారి 163పై ఉంది. 2019లో సామల బుచ్చిరెడ్డి తొలి మేయరుగా ఎన్నికైనారు. చెంగిచెర్ల (Chengicherla): చెంగిచెర్ల మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న చెంగిచెర్ల 2016లో బోడుప్పల్ పురపాలకసంఘంలో కలిసింది. 2019లో బోడుప్పల్ నగరపాలక సంస్థగా మారింది. మేడిపల్లి (Medipalli): మేడిపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న మేడిపల్లి 2016లో పీర్జాదిగూడ పురపాలకసంఘంలో కలిసింది. ఇది 2019లో నగరపాలక సంస్థగా మారింది. పర్వతాపూర్ (Parvatapur): పర్వతాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న పర్వతాపూర్ 2016లో పీర్జాదిగూడ పురపాలకసంఘంలో కలిసింది. ఇది 2019లో నగరపాలక సంస్థగా మారింది. పీర్జాదిగూడ (Peerzadiguda): పీర్జాదిగూడ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణప్రాంతము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న పీర్జాదిగూడ 2016లో మేడిపల్లి మరియు పర్వతాపూర్ పంచాయతీలతో కలిపి పురపాలకసంఘంగా, 2019లో నగరపాలక సంస్థగా మారింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Medipalli Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి