నల్గొండ పట్టణము తెలంగాణ రాష్ట్రపు ప్రధాన పట్టణాలలో ఒకటి. ఈ పట్టణం జిల్లా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, లోక్‌సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఆగ్నేయ దిశలో 100 కిమీ దూరంలో ఉన్న ఈ పట్టణానికి రైలుమార్గం కూడా ఉంది. జాతీయ రహదారి కూడా సమీపం నుంచి వెళ్ళుచున్నది. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం పూర్వనామం నీలగిరి. పట్టణ శివారులో ఉదయసముద్రం, ఛాయాసోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం ఉన్నాయి. 2011 ప్రకారం నల్గొండ పట్టణ జనాభా 1.65 లక్షలు. పట్టణ పాలన పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. ప్రముఖ రచయిత కాంచనపల్లి చినవెంకటరామారావు ఇక్కడివారే (నల్గొండ శివారు).
భౌగోళీకం: నల్గొండ పట్టణం 17.05° ఉత్తర అక్షాంశం మరియు 79.26° తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ పట్టణం సముద్రమట్టం నుంచి 420 మీ. ఎత్తులో ఉంది. చుట్టూ కొండలతో ఆవరించబడి ఉంది కాబట్టి చలికాలంలోనూ కనిష్ట ఉష్ణోగ్రత 30°Cలకు పైబడి ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు 40°C దాటి ఉంటుంది. 2011 ప్రకారం నల్గొండ పట్టణ జనాభా 1.65 లక్షలు. చరిత్ర: నల్గొండ పట్టణానికి పాతరాతియుగం కాలం నాటి చరిత్ర ఉంది. పట్టణ శివారులో పాత రాతియుగం కాలపు పనిముట్లు కూడా లభించాయి. శివారులోలో కొత్త రాతియుగపు ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యాయి. మౌర్యులు, శాతవాహనుల కాలంలో నల్గొండ భాగంగా ఉండేది. ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ బౌద్ధమతం విలసిల్లింది. చాళుక్యుల మరియు రాష్ట్రకూటుల తర్వాత కాకతీయుల కాలంలో పట్టణం కొత్తరూపు సంతరించుకుంది. కాకతీయుల తర్వాత క్రీ.శ.1455లో జలాల్‌ఖాన్ నల్గొండను వశపర్చుకున్నాడు. కాని వెంటనే బహమనీలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల పాలనలో కొనసాగి సెప్టెంబరు 17, 1948న భారత యూనియన్‌లో విలీనమైంది. 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగి జూన్ 2, 2014న కొత్తగ అవతరించిన తెలంగాణలో భాగమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, మహిళలు ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2011లో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె పూర్తిగా జయప్రదమైంది.
పట్టణ పాలన: నల్గొండ పట్టణ పాలన పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. నల్గొండ పురపాలక సంఘం 1941లో ప్రారంభమైంది. ప్రారంభంలో మూడో శ్రేణి పురపాలక సంఘంగా మొదలై అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా స్థిరపడింది. దీన్ని నగరపాలక సంస్థ (కార్పొరేషన్)గా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. పారిశుద్ధ్యం, వీధిదీపాల ఏర్పాటు, మంచినీటి సరఫరా, ప్రజారోగ్యం తదితర పనులను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ప్రభుత్వ గ్రాంటులు మరియు ప్రత్యక్ష వసూళ్ళు (ఆస్తిపన్ను, కొళాయిపన్నులు, అనుమతిపన్నులు etc) పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులు. రవాణా సౌకర్యాలు: పూనె నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి నెం.65 నల్గొండ పట్టణానికి 15 కిమీ దూరం నుంచి నార్కెట్‌పల్లి మీదుగా వెళ్ళుచున్నది. అయితే జాతీయ రహదారి నెం. 565 నల్గొండ మీదుగా వెళ్ళుచున్నది. తెలంగాణ ఆర్టీసి బస్సు డిపో కూడా నల్గొండలో ఉంది. పట్టణానికి రైలు సదుపాయం కూడా ఉంది. పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్‌లో దక్షిణమధ్య రైల్వేలో గుంటూరు డివిజన్‌లో భాగంగా నల్గొండ రైల్వేస్టేషన్ ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
7, జనవరి 2021, గురువారం
నల్గొండ పట్టణం (Nalgonda Town)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి