2, జులై 2014, బుధవారం

నల్గొండ జిల్లా (Nalgonda Dist)

నల్గొండ జిల్లా
వైశాల్యం7122 చకిమీ
జనాభా16,18,416
మండలాలు31
రెవెన్యూ డివిజన్లు3
నల్గొండ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. జిల్లా పరిపాలన కేంద్రము నల్గొండ. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. కృష్ణానది, డిండి నది, మూసి నది జిల్లాలో ప్రవహించే ముఖ్య నదులు. పూణె-విజయవాడ జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. మరింగంటి సింగరాచార్యులు, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి సాహితీవేత్తలు, రావిచెట్టు రంగారావు లాంటి సమరయోధులు, కుందూరు జానారెడ్డి లాంటి రాజకీయ నాయకులు ఈ జిల్లాకు చెందినవారు.

అక్టోబరు 11, 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు 59 మండలాలతో ఉన్న నల్గొండ జిల్లా నుంచి తూర్పు భాగం మండలాలతో సూర్యాపేట జిల్లా, ఉత్తర భాగం మండలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాడ్డాయి. కొత్తగా ఏర్పడిన మండలాలతో కలిపి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 31 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా ఇదే.

జిల్లా వైశాల్యం 7122 చకిమీ. 2011 లెక్కల ప్రకారం జనాభా 16,18,416. రాష్ట్రంలోనే పెద్దదైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రముఖమైన దేవరకొండ దుర్గం ఈ జిల్లాకు చెందినవి. జిల్లాలో 31 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
నల్గొండ జిల్లాకు తూర్పున సూర్యాపేట జిల్లా, ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లా, పశ్చిమాన నాగర్‌కర్నూల్ జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాలు, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది, తూర్పు సరిహద్దు గుండా మూసినది ప్రవహిస్తున్నాయి.

చరిత్ర:
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
నల్గొండ జిల్లాలో పాతరాతియుగం నాటి వస్తువులెన్నో లభించాయి (నాగార్జునకొండ, ఏలేశ్వరం, ఇంద్రపాల నగరం, జానకీపురం, రాయగిరి, నార్కెట్ పల్లి, సిరిపురం తదితర ప్రాంతాలలో). నార్కెట్ పల్లి ప్రాంతంలో వేల సంఖ్యలో సమాధిరాళ్ళు కనిపిస్తాయి. దేవరకొండ సమీపంలోని హుముతాలపల్లిలో బూడిదకుప్పలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏలేశ్వరం ప్రాంతంలో ఏనుగు ఆకారంలో తయారుచేసిన మృణ్మయ సమాధి పెట్టెలు ఉన్నాయి. రామాయణంలో పేర్కొనబడిన బదరికారణ్యం నల్గొండలోనిదేనని చరిత్రకారుల అభిప్రాయం. జీడికల్లులోని నీటి ఊట రామాయణ కాలం నాటిదేననే అభిప్రాయం ఉంది. బౌద్ధకాలం నాటి చైత్యాలు ఫణిగిరిలో లభించాయి. ఆనాటి జైన సంప్రదాయానికి పటంచెరు, కొలనుపాక నిలయాలు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 16,18,416. అందులో పురుషులు 8,18,306 మరియు మహిళలు 8,00,110.ఉమ్మడి నల్గొండ జిల్లా


ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, నల్గొండ జిల్లా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక