25, జూన్ 2015, గురువారం

హైదరాబాదు రాష్ట్రం (Hyderabad State)

హైదరాబాదు రాష్ట్రం (1948-56)
అవతరణ1948
జిల్లాలు16
రాజధానిహైదరాబాదు
హైదరాబాదు రాజ్యంపై భారత యూనియన్ పోలీసుచర్య ద్వారా విలీనం చేసుకున్న పిదప 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అప్పట్లో ఈ రాష్ట్రంలో 16 జిల్లాలుండేవి. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణ వరకు కొనసాగి ఆ తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రాంతాలు 3 రాష్ట్రాలలో విలీనమయ్యాయి. హైదరాబాదు రాజ్య చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ రాజ్‌ప్రముఖ్‌గా వ్యవహరించారు. జె.ఎన్.చౌదరి మిలటరీగవర్నరుగా, ఆ తర్వాత వెల్లోడి మరియు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

హైదరాబాదు రాష్ట్రంలోని ప్రాంతాలు:

బూర్గుల రామకృష్ణారావు
ఆంధ్రరాష్ట్రంలో విలీనం- విభజన:
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణ సమయంలో కన్నడ మాట్లేడే ప్ప్రాంతాలు మైసూరు రాష్ట్రానికి, మరాఠి మాట్లాడే ప్రాంతాలు బొంబాయి రాష్ట్రానికి తరలించగా, తెలుగు భాషా మాట్లాడే ప్రాంతాలైన 8 జిల్లాలు (అప్పట్లో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు లేకుండేవి) మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న పూర్వ హైదరాబాదులోని తెలుగు ప్రాంతం తెలంగాణగా పిలువబడుతూ పలుమార్లు ప్రత్యేక రాష్ట్రంకై ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిననూ రాజకీయ కారణాల వల్ల అంతమైంది. మళ్ళీ 2013లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తగా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి 10 జిల్లాలను విడదీసి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.


విభాగాలు: 1956కు ముందు భారతదేశ రాష్ట్రాలు, హైదరాబాదు, తెలంగాణ చరిత్ర, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక