మూడుచింతలపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మార్చి 7, 2019న కొత్తగా ఏర్పడింది. శామీర్‌పేట మండలంలో ఉన్న 17 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేశారు. మండల జనాభా 33,514. గ్రామాల సంఖ్య 17. మండల పరిధిలోని కేశ్వాపూర్‌లో హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. అక్టోబరు 29, 2020న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే ధరణి వెబ్‌సైట్ మండలకేంద్రం మూడుచింతలపల్లిలో ప్రారంభించారు. చరిత్ర: సెప్టెంబరు 17, 1948న ఈ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమైంది. ఆ తర్వాత 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో, 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో సకల జనుల సమ్మె పూర్తిగా జయప్రదమైంది. జూన్ 2, 2014న కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. అక్టోబరు 11, 2016కు ముందు రంగారెడ్డి జిల్లాలో (చిన్న పర్వతాపుర్ మినహా, ఇది నల్గొండ జిల్లాలో ఉండేది) భాగంగా ఉన్న ఈ ప్రాంతం తెలంగాణలో జిల్లాల పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. 1978కు ముందు ఈ మండలంలోని గ్రామాలు హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండేవి. మార్చి 2019లో ఈ మండలం కొత్తగా అవతరించింది. భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం మేడ్చల్ జిల్లాలో ఈశాన్యాన ఉంది. రాజకీయాలు: ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని గ్రామాలు:
లింగాపుర్, చిన్నపర్వతాపూర్, ఉద్దమర్రి, ఉషార్‌పల్లి, యాకత్‌పుర్, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్లూరు, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్‌పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపన్‌బోల్, కేశ్వాపూర్
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: కేశ్వాపూర్ (Keshwapur):కేశ్వాపూర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇక్కడ హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. మూడుచింతలపల్లి (Muduchintalapalli): మూడుచింతలపల్లి మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. శామీర్‌పేట మండలంలో ఉన్న ఈ గ్రామము 2019లో కొత్తగా మండల కేంద్రంగా మారింది. అక్టోబరు 29, 2020న ఇక్కడ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే ధరణి పోర్టర్ ప్రారంభించారు. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి