మూడుచింతలపల్లి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మూడుచింతలపల్లి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

10, మార్చి 2019, ఆదివారం

మూడుచింతలపల్లి మండలం (Muduchintalapalli Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్కీసర
అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
లోకసభ నియోమల్కాజ్‌గిరి
జనాభా
33,514
రెవెన్యూ గ్రామాలు
17
మూడుచింతలపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మార్చి 7, 2019న కొత్తగా ఏర్పడింది. శామీర్‌పేట మండలంలో ఉన్న 17 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేశారు. మండల జనాభా 33,514. గ్రామాల సంఖ్య 17. మండల పరిధిలోని కేశ్వాపూర్‌లో హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు.
 
అక్టోబరు 29, 2020న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే ధరణి వెబ్‌సైట్ మండలకేంద్రం మూడుచింతలపల్లిలో ప్రారంభించారు. 
 
చరిత్ర:
సెప్టెంబరు 17, 1948న ఈ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమైంది. ఆ తర్వాత 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో, 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో సకల జనుల సమ్మె పూర్తిగా జయప్రదమైంది. జూన్ 2, 2014న కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది.  అక్టోబరు 11, 2016కు ముందు రంగారెడ్డి జిల్లాలో (చిన్న పర్వతాపుర్ మినహా, ఇది నల్గొండ జిల్లాలో ఉండేది) భాగంగా ఉన్న ఈ ప్రాంతం  తెలంగాణలో జిల్లాల పునర్విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. 1978కు ముందు ఈ మండలంలోని గ్రామాలు హైదరాబాదు జిల్లాలో భాగంగా ఉండేవి. మార్చి 2019లో ఈ మండలం కొత్తగా అవతరించింది. 

 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం మేడ్చల్ జిల్లాలో ఈశాన్యాన ఉంది.
 
మండలంలోని గ్రామాలు:
లింగాపుర్, చిన్నపర్వతాపూర్, ఉద్దమర్రి, ఉషార్‌పల్లి, యాకత్‌పుర్, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్లూరు, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్‌పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపన్‌బోల్, కేశ్వాపూర్
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
కేశ్వాపూర్ (Keshwapur):
కేశ్వాపూర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇక్కడ హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు.
మూడుచింతలపల్లి (Muduchintalapalli):
మూడుచింతలపల్లి మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. శామీర్‌పేట మండలంలో ఉన్న ఈ గ్రామము 2019లో కొత్తగా మండల కేంద్రంగా మారింది. అక్టోబరు 29, 2020న ఇక్కడ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే ధరణి పోర్టర్ ప్రారంభించారు.




ఇవి కూడా చూడండి:

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, మూడుచింతలపల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

22, ఆగస్టు 2016, సోమవారం

మేడ్చల్ జిల్లా (Medchal District)

మండలాలు15
రెవెన్యూ డివిజన్లు2
వైశాల్యం1084
జనాభా2440073
రెవెన్యూ గ్రామాలు
163
గ్రామపంచాయతీలు
61
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పాటైన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా గుండా 3 జాతీయ రహదారులు, 3 రైల్వే మార్గాలు వెళ్ళుచున్నాయి. 

చారిత్రకమైన త్రేతాయుగం నాటి శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈ జిల్లాలో ఉంది. సమరయోధురాలు సంగెం లక్ష్మీబాయమ్మ, వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉమావెంకట్రాంరెడ్డి ఈ జిల్లాకు చెందినవారు.

మేడ్చల్ జిల్లాలో చాలా భాగం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. అంతేకాకుండా జిల్లాలో 4 నగరపాలక సంస్థలు (పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్), 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

మండలాలు:
మేడ్చల్, షామీర్‌పేట్, కీసర, కాప్రా, ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, దుండిగల్ గండిమైసమ్మ, బాచుపల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, మూడుచింతలపల్లి.
 
చరిత్ర:
సెప్టెంబరు 17, 1948న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాదు జిల్లాలో భాగంగా హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన పిదప 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయంలో ఈ ప్రాంతం అప్పుడు కొత్తగా అవతరించిన రంగారెడ్డి జిల్లాలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె జయప్రదమైంది. జూన్ 2, 2014లో ఈ ప్రాంతం కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో రంగారెడ్డి జిల్లా నుంచి విడదీసిన 14 మండలాలతో మేడ్చల్ జిల్లా ఏర్పాటైంది. మార్చి 2019లో శామీర్‌పేట మండలాన్ని విభజించి మరో మండలాన్ని (మూడుచింతలపల్లి మండలం) ఏర్పాటుచేశారు. 

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం,  కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు-వాడి మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. 7వ నెంబరు (కొత్తపేరు 44), 9వ నెంబరు మరియు 202 నెంబరు జాతీయ రహదారులు కూడా జిల్లాపై నుంచి వెళ్తున్నాయి.
 
రాజకీయాలు:
మేడ్చల్ జిల్లాకు చెందిన మండలాలు మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తాయి.


ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా,


 = = = = =


6, సెప్టెంబర్ 2020, ఆదివారం

కాలరేఖ 2020 (Timeline 2020)

కాలరేఖ 2020 
 (Timeline 2020)
  • జనవరి 10: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమల్లోకి వచ్చింది
  • జనవరి 10:ఓమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్ మరణం
  • జనవరి 31: యునైటెడ్ కింగ్‌డమ్‌ యూర్పియన్ యూనియన్ నుంచి పూర్తిగా బయటపడింది 
  • ఫిబ్రవరి 8: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరిగాయి
  • ఫిబ్రవరి 11: కరోనా వైరస్ వల్ల వచ్చు వ్యాధికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవిడ్-19గా పేరుపెట్టించి
  • ఫిబ్రవరి 24: మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ పదవికి రాజీనామా చేశారు
  • ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చారు
  • ఫిబ్రవరి 25: ఏకీకృత రిజిస్ట్రేషన్ కార్డు(యూనిఫైడ్ వెహిక‌ల్ రిజిస్ట్రేష‌న్ కార్డ్)ను దేశంలో మొద‌టిసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్రవేశపెట్టబడింది
  • ఫిబ్రవరి 25: ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ మరణం
  • ఫిబ్రవరి 27: స్వాతంత్య్ర సమరయోధుడు సుధాకర్‌ చతుర్వేది మరణం
  • ఫిబ్రవరి 28: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్‌ సింగ్‌ కుల్లర్‌ మరణం
  • ఫిబ్రవరి 29: ప్రజారవాణాను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా లక్సెంబర్గ్ అవతరించింది
  • మార్చి 1: అమెరికా, తాలిబన్‌ చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టాయి
  • మార్చి 4: ఉత్తరాఖండ్‌ వేసవి రాజధానిగా గౌర్‌స్సేణ్‌ ఎంపిఅకచేశారు
  • మార్చి 4: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జేవియర్ పెరెజ్ డి క్యూల్లార్ మరణం
  • మార్చి 5: ఔరంగాబాద్ విమానాశ్ర‌యం పేరును ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఏయిర్‌పోర్ట్ గా మార్చబడింది
  • మార్చి 5: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం
  • మార్చి 8: కేంద్ర మాజీ మంత్రి హన్స్‌ రాజ్‌ భరద్వాజ్‌ మరణం
  • మార్చి 8: రాజకీయ నాయకుడు హన్స్‌రాజ్ భరధ్వాజ్ మరణం
  • మార్చి 13: గ్రీస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా కాటెరినా సాకెల్లోపౌలో పదవి పొందారు

  • మార్చి 19: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కరోనా (కోవిడ్‌-19)ను జీవ విపత్తు (బయోలాజికల్‌ డిజాస్టర్‌)గా ప్ర‌క‌టించింది
  • మార్చి 20: ఫుట్‌బాల్ క్రీడాకారుడు పి.కె.బెనర్జీ మరణం 
  • మార్చి 22: కరోనా వ్యాప్తి నివారణకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పిల్పు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించబడింది
  • మార్చి 23: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు
  • మార్చి 23: దేశంలోనే తొలిసారిగా ముంబయిలో కొవిడ్‌-19 ఆసుపత్రిని ఏర్పాటు చేయబడింది (రిలయన్స్‌ సంస్థచే)
  • మార్చి 23: తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం డీమ్డ్‌ విశ్వవిద్యాలయాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా మార్చబడింది
  • మార్చి 26: కాళాకారుడు సతీశ్‌ గుజ్రాల్‌ మరణం (ప్రధానిగా పనిచేసిన ఐకె గుజ్రాల్ సోదరుడు)
  • మార్చి 27: రాజకీయ నాయకుడు బేణిప్రసాద్ వర్మ మరణం 
  • మార్చి 27: బ్రహ్మకుమారీస్‌ సంస్థాన్‌ అధ్యక్షురాలు, రాజయోగిని దాదీ జానకి మరణం
  • మార్చి 27: అమెరికాకు చెందిన‌ ప్రముఖ పౌర హ‌క్కుల ఉద్య‌మ నేత జోసెఫ్ లౌరీ మ‌ర‌ణం
  • మార్చి 27: కేంద్ర మాజీ మంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ మరణం
  • మార్చి 27: నాటోలో 30వ సభ్యదేశంగా ఉత్తర మాసిడోనియా చేరింది
  • మార్చి 30: దేశంలో తొలిసారి మణిపూర్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫుట్‌బాల్ టీం ఏర్పాటైంది
  • మార్చి 30: కాంగో మాజీ అధ్య‌క్షుడు జాక్వెస్ జాక్విన్ యోంబి ఒపాంగో మరణం
  • ఏప్రిల్ 2: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) కేసుల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది
  • ఏప్రిల్ 5: లిబియా మాజీ ప్రధాని మ‌హ్మ‌ద్‌ జిబ్రిల్ మరణం
  • ఏప్రిల్ 7: దేశంలో మాస్కును తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా ఒడిశా అవతరించింది
  • ఏప్రిల్ 16: కరోనా రోగులను గుర్తించడానికి కేంద్రం అభివృద్ధి చేసిన ఆరోగ్య సేతు యాప్ 5 కోట్ల డౌన్‌లోడ్లు పూర్తి చేసుకున్న ఏకైక మొబైల్‌ యాప్‌గా ప్రపంచరికార్డు సృష్టించింది
  • ఏప్రిల్ 22: షెడ్యూల్డు ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది
  • ఏప్రిల్ 25: తెలంగాణ‌లో ప్రభుత్వం పంట సీజన్ల పేర్లను మార్చింది. (జూన్‌ నుంచి సెప్టెంబరు కాలాన్ని ఖరీఫ్‌ బదులు వానాకాలం సీజన్‌గా, అక్టోబరు నుంచి మార్చి కాలాన్ని రబీ బదులు యాసంగిగా)
  • ఏప్రిల్ 28: OECDలో 28వ సభ్యదేశంగా కొలంబియా అవతరించింది
  • ఏప్రిల్ 29: బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం
  • ఏప్రిల్ 30: బాలీవుడ్ సినీనటుడు రిషికపూర్ మరణం
  • ఏప్రిల్ 30: ఫుట్‌బాల్ క్రీడాకారుడు చుని గోస్వామి మరణం
  • ఏప్రిల్ 30: భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు చునీ గోస్వామి మరణం
  • మే 6: ఫోర్బ్స్‌ ఇండియా బిలియనీర్ల జాబితా (2020)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశంలో అత్యంత కుబేరుడిగా తొలిస్థానం పొందారు
  • మే 7: సాక్షర భారత్‌ స్థానంలో పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌ ప్రారంభించబడింది
  • మే 7: విశాఖపట్టణంలొ పాలిమర్ పరిశ్రమలో విషవాయువు లీకై 11 మంది మరణం, 5000+ మందికి అనారోగ్యం కలిగింది 
  • మే 10: ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త ప్రొఫెసర్‌ హరిశంకర్‌ వాసుదేవన్‌ మరణం
  • మే 14: యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలోని చేనేత మగ్గాలపై తయారయ్యే తేలియా రుమాలు జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌(జీఐ) గుర్తింపు పొందింది
  • మే 21: తూర్పు భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లలో అంపన్ తుఫాను వల్ల 100 మంది మరణం, ఆస్తినష్టం కలిగింది
  • మే 25: భారత హాకీ ఆటగాడు బల్బీర్‌ సింగ్‌ మరణం
  • మే 29: ఛత్తీస్‌గఢ్‌ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్‌ ప్రమోద్‌ కుమార్‌ జోగి మరణం
  • మే 30: భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు బీర్‌ బహదూర్‌ మరణం
  • జూన్ 11: రిజర్వేషన్‌ అనేది వ్య‌క్తి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది
  • జూన్ 11: భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రత్తన్‌ లాల్‌కు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌-2020 ప్రకటించబడింది
  • జూన్ 14: సినీనటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు
  • జూన్ 17: 2021-21 కాలానికిగాను భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది
  • జూన్ 18: ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ ఎన్నికైంది (2021-22 సం.కి గాను)
  • జూన్ 19: ప్రపంచంలో అత్యంత విలువైన 10 ఎక్స్ఛేంజీల జాబితాలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) స్థానం పొందింది
  • జూన్ 21: తూర్పు ఆఫ్రికా, ఆసియా (భారత్‌తో పాటు)లలో సూర్యగ్రహణం ఏర్పడింది 
  • జూన్ 28: కోవిడ్-19 (కరోనా) కేసుల సంఖ్య ప్రపంచచ్యాప్తంగా కలిపి 10 మిలియన్లు (ఒక కోటి) దాటింది
  • జూన్ 29:  భారత్ చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది
  • జూలై 3: డాన్సర్ మరియు కొరొయోగ్రాఫర్‌గా ప్రసిద్ధి చెందిన సరోజ్ ఖాన్ మరణం
  • జూలై 8: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది
  • జూలై 8: తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు

  • జూలై 10: మధ్యప్రదేశ్‌లోని రీవాలో 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంటు ప్రధాని నరేంద్రమోదీచే ప్రారంభిచబడింది
  • జూలై 11:పార్లమెంటు ఎన్నికల్లో సింగపూర్‌ ప్రధాని లీ సియెన్‌ లూంగ్‌ ఆధ్వర్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) విజయం సాధించింది
  • జూలై 11: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2018 పులుల "కెమెరాల ద్వారా బంధించిన అతిపెద్ద వన్యప్రాణి సర్వే"గా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది
  • జూలై 13: కేరళలోని శ్రీఅనంత పద్మనాభ ఆలయ నిర్వహణపై ట్రావెన్‌కోర్‌ (తిరువనంతపురం) రాజకుటుంబానికి హక్కులు ఉన్నట్టు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది
  • జూలై 20: జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం-2019 అమలులోకి వచ్చింది
  • జూలై 21: రాజకీయ నాయకుడు లాల్జీటాండన్ మరణం
  • జూలై 23: భారతీయ సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటైంది
  • జూలై 25: ఉద్యమనేతగా పేరుపొందిన ఉప్పుమావులూరి సాంబశివరావు మరణం
  • జూలై 28: పారిశ్రామికవేత్త బీఎస్ బజాజ్ మరణం
  • జూలై 29: నూతన జాతీయ విద్యావిధానం - 2020ను కేంద్రమంత్రిమండలి ఆమోదించింది
  • జూలై 29: ప్రాన్సు నుంచి 5 రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్ చేరాయి (అంబాలా వైమానిక స్థావరానికి)
  • జూలై 31: ఆంధ్రప్రదేశ్ 3 రాజధానుల బిల్లు ఆమోదించబడింది
  • ఆగస్టు 1 : ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణం
  • ఆగస్టు 1: రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ మరణం

  • ఆగస్టు 5: బీరుట్ (లెబనాన్)లో భారీ పేలుడు, దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు
  • ఆగస్టు 5: దేశంలో తొలిసారిగా కార్గో ఎక్స్‌ప్రెస్‌ దక్షిణ మధ్యరైల్వేలో ప్రారంభించబడింది (సనత్‌నగర్ నుంచి ప్రారంభం)
  • ఆగస్టు 5: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ నీలంగేకర్ పాటిల్ మరణం
  • ఆగస్టు 6: అఖిలభారత చేనేత మండలిని రద్దు చేయబడింది
  • ఆగస్టు 6: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం
  • ఆగస్టు 7: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్‌ పార్ టీ(ఎస్‌ఎల్‌పీపీ) భారీ విజయం సాధించింది
  • ఆగస్టు 7: మహారాష్ట్రలో తొలి కిసాన్‌ రైలు ప్రారంభించబడింది
  • ఆగస్టు 7: కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై ముక్కలైంది
  • ఆగస్టు 11: కోవిడ్-19 నివారణకు రష్యా "స్పుత్నిక్‌-వి" పేరిట వాక్సీన్ విడుదల చేసింది
  • ఆగస్టు 16: భారత మాజీ క్రికెటర్ మరియు రాజకీయ నాయకుడు చేతన్ చౌహాన్ మరణం
  • ఆగస్టు 17: శాస్త్రీయ సంగీత విధ్వాంసుడు పండిత్ జస్‌రాజ్ మరణం
  • ఆగస్టు 19: మేఘాలయ గవర్నర్‌గా సత్య పాల్‌ మాలిక్‌ బాధ్యతలు చేపట్టారు
  • ఆగస్టు 20: 5వ విడత స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంక్ (2020)లో ఇండోర్ ప్రథమస్థానంలో నిలిచింది (లక్షపైబడి జనాభా ఉన్న నగరాలలో)
  • ఆగస్టు 25: ప్రముఖ గేయ, కథా రచయిత కలువకొలను సదానంద మరణం
  • ఆగస్టు 26: అమేజాన్ అధిపతి జెఫ్ బెజోస్ 200 బిలియన్లు ఆస్తి కల్గిన తొలి వ్యక్తిగా అవతరించాడు
  • ఆగస్టు 27: ఎస్సీ, ఎస్టీలు, సామాజికంగా ఇతరత్రా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది
  • ఆగస్టు 28: జపాన్‌ను అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రి షింజో అబె పదవికి రాజీనామా చేశారు 
  • ఆగస్టు 31: భారత రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ మరణం 
  • సెప్టెంబరు 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాతంగి నర్సయ్య మరణం
  • సెప్టెంబరు 4: పోప్ బెనెడిక్ట్ 16 అత్యధిక కాలం జీవించిన పోప్‌గా అవతరించాడు
  • సెప్టెంబరు 6: సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌళిక స్వరూపంపై కీలకమైన తీర్పు ఇవ్వడానికి కారకుడైన కేశవానంద భారతి మరణం
  • సెప్టెంబరు 9: సాహితీవేత్త రామచంద్రమౌళి కాళోజీ అవార్డు అందుకున్నారు
  • సెప్టెంబరు 13: 2020 అమెరికన్ ఓపెన్ (మహిళల) టెన్నిస్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా సాధించింది. 
  • సెప్టెంబరు 13: రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, బీహార్‌కు చెందిన రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం 
  • సెప్టెంబరు 14: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ మరోసారి ఎన్నికయ్యారు 
  • సెప్టెంబరు 14: అమెరిక ఓపెన్ టెన్నిస్ (పురుషుల) టైటిల్‌ను ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్‌ గెలుచుకున్నాడు
  • సెప్టంబరు 16: తిరుపతి లోక్‌సభ సభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి బల్లి దుర్గాప్రసాద్ రావు మరణం
  • సెప్టెంబరు 16: జపాన్‌ ప్రధానిగా యోషిహిదే సుగా ఎన్నికయ్యారు 
  • సెప్టెంబరు 17: అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు
  • సెప్టెంబరు 22: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది

  • సెప్టెంబరు 25: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం
  • సెప్టెంబరు 27: కేంద్రమంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జశ్వంత్ సింగ్ మరణం
  • సెప్టెంబరు 27: నాగొర్నో-కరాబాఖ్‌ ప్రాంతంకై ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య ఘర్షణ ప్రారంభమైంది
  • సెప్టెంబరు 29: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) మరణాల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది 
  • సెప్టెంబరు 29: వరుసగా తొమ్మిదో ఏడాది ముకేశ్ అంబాని దేశంలో అత్యంత ఆస్తిపరుడిగా నిల్చారు
  • సెప్టెంబరు 29: ప్రముఖ చిత్రకారుడు శంకర్ మరణం
  • సెప్టెంబరు 30: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా అగ్రనాయకులకు, సంఘ్ నాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.
  • అక్టోబరు 2: దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది
  • అక్టోబరు 3: దేశంలోనే అతి పొడవైన సొరంగమార్గం (అటల్ టన్నెల్) హిమాలయాల్లోని రోహ్‌తాంగ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ప్రారంభించబడింది
  • అక్టోబరు 7: సీబీసి డైరెక్టరుగా, నాగాలాండ్ గవర్నరుగా పనిచేసిన అశ్వినీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు
  • అక్టోబరు 8: కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణం
  • అక్టోబరు 10: ఫ్రెంచ్ ఓపెన్ (మహిళల) సింగిల్స్ టైటిల్‌ను పోలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది
  • అక్టోబరు 11: ఫ్రెంచ్ ఓపెన్ (పురుషుల) సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ సాధించాడు
  • అక్టోబరు 11: ప్రధానమంత్రి నరేంద్రమోడిచే స్వామిత్వ పథకం ప్రారంభించబడింది 
  • అక్టోబరు 12: రాజమాత విజయరాజె సింధితా జ్ఞాపకార్థం రూ.100/- నాణెం విడుదల చేయబడింది
  • అక్టోబరు 13: 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుండా మల్లేశ్ మరణం
  • అక్టోబరు 14: ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి శోభానాయుడు మరణం
  • అక్టోబరు 15: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, మలయాళ కవి ఏ.ఏ.నంబూద్రి మరణం 
  • అక్టోబరు 15: భారత్ తరఫున తొలి ఆస్కార్ (అకాడమి) పురస్కారం పొందిన భాను అథైయ మరణం

 

 

    ఇవి కూడా చూడండి:

    హోం
    విభాగాలు: కాలరేఖలు, 2020,

      26, అక్టోబర్ 2020, సోమవారం

      అక్టోబరు 29 (October 29)

      చరిత్రలో ఈ రోజు
      అక్టోబరు 29
      • 1851: బెంగాల్ బ్రిటీష్ ఇండియా అసోసియేషన్ స్థాపించబడింది
      • 1897: జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేసిన జోసెఫ్ గోబెల్స్ జననం
      • 1899: కవి, సమరయోధుడు నాయని సుబ్బారావు జననం
      • 1911: పులిట్జర్ ఇంక్ (మీడియా) స్థాపకుడు జోసెఫ్ పులిట్జర్ మరణం
      • 1922: విక్టర్ ఎమాన్యుయెల్-3 చే బెనిటో ముస్సోలినీ ఇటలీ ప్రధానమంత్రిగా నియమితులైనాడు
      • 1940: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మరణం
      • 1957: ఆస్కార్ (అకాడమి) అవార్డు వ్యవస్థాపకుడు లూయీస్ బర్ట్ మేయర్ మరణం


      • 1961: సిరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బయటపడింది
      • 1964: తాంగ్యానియా మరియు జాంజిబార్ పేరును తాంజేనియాగా మార్చబడింది
      • 1971: ఒడిషాలో తుపాను వల్ల 10 వేలమంది మరణించారు
      • 1981: సినీనటి రీమాసేన్ జననం
      • 1985: బాక్సర్ విజేందర్ కుమార్ జననం
      • 2005: ఢిల్లీ బాబుపేలుళ్లలో 60మంది మరణించారు
      • 2015: చైనా 35 సం.ల తర్వాత "ఒకే బిడ్డ విధానం" (One-child policy) ను రద్దుచేసింది
      • 2020: మూడుచింతలపల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రిచే ధరణి పోర్టల్ ప్రారంభించబడింది

       

      ఇవి కూడా చూడండి:



      హోం,
      విభాగాలు:
      చరిత్రలో ఈ రోజు,


      = = = = =
      Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

      12, నవంబర్ 2016, శనివారం

      విభాగము: మేడ్చల్ జిల్లా మండలాలు (Portal: Medchal District Mandals)



      విభాగము: మేడ్చల్ జిల్లా మండలాలు 
      (Portal: Medchal District Mandals)
      1. ఆల్వాల్ మండలం (Alwal Mandal),
      2. బాచుపల్లి మండలం (Bachupally Mandal),
      3. బాలానగర్ మండలం (Balanagar Mandal),
      4. దుండిగల్ గండిమైసమ్మ మండలం (Dundigal Gandimaisamma Mandal),
      5. ఘట్‌కేసర్ మండలం (Ghatkesar Mandal),
      6. కాప్రా మండలం (Kapra Mandal),
      7. కీసర మండలం (Keesara Mandal),
      8. కూకట్‌పల్లి మండలం (Kukatpally Mandal),
      9. మల్కాజ్‌గిరి మండలం (Malkajgiri Mandal),
      10. మేడ్చల్ మండలం (Medchal Mandal),
      11. మేడిపల్లి మండలం (Medipally Mandal),
      12. మూడుచింతలపల్లి మండలం (Muduchintalapalli Mandal),
      13. కుతుబుల్లాపూర్ మండలం (Qutballapur Mandal),
      14. షామీర్‌పేట్ మండలం (Shamirpet Mandal),
      15. ఉప్పల్ మండలం (Uppal Mandal),

      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా,  తెలంగాణ మండలాలు
      = = = = =

      7, నవంబర్ 2020, శనివారం

      శామీర్‌పేట్ మండలం (Shamirpet Mandal)

      జిల్లామేడ్చల్
      రెవెన్యూ డివిజన్కీసర
      అసెంబ్లీ నియోమేడ్చల్
      లోకసభ నియోమల్కాజ్‌గిరి
      జనాభా
      117554
      రెవెన్యూ గ్రామాలు
      14
      శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి ఈమండలమునకు చెందినవారు. మండలంలోని పలు గ్రామాలలో కులీకుతుబ్‌షా కాలం నాటి చారిత్రక కట్టడాలున్నాయి. పర్యాటక ప్రాంతంగా పేరుపొందిన శామీర్‌పేట రత్నాలయం, శామీర్‌పేట చెరువు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ, జవహర్ డీర్ పార్క్, జినోమ్‌ వాలీ ఈ మండలంలో ఉన్నాయి.
       
      అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. మార్చి 7, 2019న షామీర్‌పేట మండలంలోని 17 గ్రామాలను విడదీసి కొత్తగా మూడుచింతలపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు.
       
      భౌగోళికం, సరిహద్దులు:
      ఈ మండలానికి పశ్చిమాన మేడ్చల్ మండలం, దక్షిణాన కీసర, కాప్రా, ఆల్వాల్ మండలాలు, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

      జనాభా:
      2001 లెక్కల ప్రకారం మండల జనాభా 85291. ఇందులో పురుషులు 43943, మహిళలు 41348. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 117554. ఇందులో పురుషులు 61034, మహిళలు 56520.
       
      శామీర్‌పేట్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
      మండలంలోని గ్రామాలు:
      Aliabad, Anthaipally, Bommaraspet, Devaryamjal, Lalgadimalakpet, Majeedpur, Mandaipally, Muraharipally, Ponnal, Pothaipally, Shamirpet, Singaipally, Thumkunta, Turkapally, Yadaram,
      ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు:
      .
      శామీర్‌పేట్ (Shamirpet):
      శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ రాజీవ్ రహదారి ప్రక్కన ప్రఖ్యాతిగాంచిన రత్నాలయం ఉంది. ఈ ఆలయం 2003లో నిర్మించబడింది. బిట్స్ పిలానీ, నల్సార్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆలయం సమీపంలో పెద్ద చెరువు ఉంది. ఇది శామీర్‌పేట చెరువుగా పేరుపొందింది.
      తుర్కపల్లి (Turkapalli):
      తుర్కపల్లి మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. జూలై 11, 2015 తుర్కపల్లి శివారులో ఆదిమానవుల చిత్రాల బయటపడ్డాయి.



      ఇవి కూడా చూడండి:
      • నల్సార్ విశ్వవిద్యాలయం,
      • శామీర్‌పేట చెరువు
      • శామీర్‌పేట రత్నాలయం,
      • శామీర్‌పేట చెరువు,
       
      ఫోటో గ్యాలరీ
      c
      c
      c c



      హోం,
      విభాగాలు:
      మేడ్చల్ జిల్లా మండలాలు, శామీర్‌పేట్ మండలం, 
       
       
      సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
      • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
      • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
      • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
      • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
      • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
      • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
      • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


      Shamirpet Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

      Index


      తెలుగులో విజ్ఞానసర్వస్వము
      వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
      సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
      ప్రపంచము,
      శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
      క్రీడలు,  
      క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
      శాస్త్రాలు,  
      భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
      ఇతరాలు,  
      జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

          విభాగాలు: 
          ------------ 

          stat coun

          విషయసూచిక