కమలాపూర్ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి ఉత్తరాన ఉంది. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరింది. అదే సనయంలో ఒక గ్రామం పరకాల మండలం నుంచి ఈ మండలంలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన ఎల్కతుర్తి మండలం మరియు హసన్‌పర్తి మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ మండలం, పశ్చిమాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 61458. ఇందులో పురుషులు 30925, మహిళలు 30533. అక్షరాస్యుల సంఖ్య 35925.
రాజకీయాలు:
ఈ మండలము హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ ఈ మండలానికి చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన తడక రాణి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన లండిగె కళ్యాణి విజయం సాధించారు. రవాణా సౌకర్యాలు: మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. ఉప్పల్‌లో రైల్వేస్టేషన్ ఉంది.
కమలాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ambala, Bhimpalle, Desharajpalle, Gudur, Gunded, Guniparthi, Jujnoor, Kamalapur, Kaniparthi, Kannur, Madannapeta, Marripalligudem, Nerella, Sanigaram, Uppal, Vangapalle, Venkateswarlapally H/o Narlapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గోపాల్ పూర్ (Gopalpur): గోపాల్ పూర్ వరంగల్ పట్టణ జిల్లా కమలాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో హనుమాన్ దేవాలయం ఉంది. ఎన్నికల సమయంలో నామినేషన్ వేసేముందు రాజకీయ నాయకులు ఈ ఆలయంలో పూజలుచేసి ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది. కమలాపూర్ (Kamalapur): కమలాపూర్ వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఇది కమలాపూర్ చెరువుగా పిల్వబడుతుంది. దీన్ని రిజర్వాయర్ గా చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఈ మండలమునకు చెందినవారు. ఉప్పల్ (Uppal): ఉప్పల్ వరంగల్ పట్టణ జిల్లా కమలాపూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామానికి రైలుసదుపాయం ఉంది. కాజీపేట-బల్హార్షా మార్గంలో ఉప్పల్ రైల్వేస్టేషన్ ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kamalapur Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి