దమ్మపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలానికి చెందినవారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అశ్వారావుపేట మండలం, వాయువ్యాన ముల్కలపల్లి మండలం, పశ్చిమాన ఖమ్మం జిల్లా, ఉత్తరాన మరియు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58097. ఇందులో పురుషులు 28657, మహిళలు 29440.
రాజకీయాలు:
ఈ మండలము అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. ఎనిమిదేళ్ళు మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలానికి చెందినవారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన సోయం ప్రసాద్ ఎన్నికయ్యారు.
దమ్మపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akinepalli, Amudalapadu, Ankampalem, Balarajugudem, Dammapeta, Ganeshpadu, Gunnepalli, Jaggaram, Katkoor, Lachapuram, Malkaram, Mallaram, Mandalapalli, Moddulagudem, Mustibanda, Nacharam, Nagupalli, Naidupeta, Patwarigudem, Peddagollagudem, Sayannaraopalem, Vadlagudem
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గండుగుల (Gandugula): గండుగుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలమునకు చెందిన గ్రామము. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం. ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడుల హయంలో 8 సం.లు మంత్రిగా పనిచేశారు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dammapet Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి