చర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 74 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం పశ్చిమ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు, సోమలమ్మ జలపాతం ఈ మండలంలో ఉన్నాయి. ఈ మండలానికి చెందిన ఆనంద్ పర్వతారోహకుడు. 2014లో మలావత్ పూర్ణతో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన దుమ్ముగూడ మండలం, పశ్చిమాన పినపాక మండలం మరియు మణుగూరు మండలం, వాయువ్యాన ములుగు జిల్లా, ఉత్తరాన మరియు తూర్పున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం పశ్చిమ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42929. ఇందులో పురుషులు 21125, మహిళలు 21804.
రాజకీయాలు:
ఈ మండలం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదండ రామయ్య మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
చర్ల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bathinapalli, Bhumullanka (Z), Bodanalli (G), Bodanalli (Z), C.Kathigudem, Chalamala, Cheemalapadu, Cherla (Z), Cherla(G), Chinnamidisileru (G), Chinnamidisileru (Z), Chinthaguppa, Chinthakunta (Z), Dandupeta (G), Dandupeta (Z), Devarapalli, Dosillapalli (G), Gannavaram(Z), Gogubaka(Z), Gommugudem (Z), Gommupuliboinapalli (Z), Gompalli(z), Jangalapalli (G), Jettigudem, Kaliveru (Z), Kantepalli(G), Keshavapuram (G), Kothagudem (Z), Kothapalli(G), Kothapalli(Z), Kotthuru, Koyyuru (Z), Kudunuru(G), Kudunuru(Z), Kurnapalli (G), Lingala (G) , Lingala (Z), Lingapuram(Z), M.Puliboinapalli (Z), Mamidigudem(G), Mamidigudem(Z), Mogallapalli (Z), Mummidivaram- (Z), Peddamidisileru (Z), Peddamidisileru Chalk -I, Peddamidisileru Chalk -II, Peddamidisileru Chalk -III, Peddipalli, Puligundala, Pusuguppa Patch-1, Pusuguppa Patch-II, Pusuguppa(G), R.kothagudem(G), Rallagudem, Ramanujapuram (G), Regunta (G), Regunta (Z), Ricepeta (G), Sarangapani(G), Sarangapani(Z), Singasamudram(G), Srinivasapuram (Z), Subbampeta (G), Subbampeta (Z), Subbampeta Pach, Tegada (G), Tegada (Z), Tippapuram, Unjupalli(G), Upparigudem(G), Uyyalamadugu (G), Uyyalamadugu (Z), Vaddipeta(Z), Veerapuram (Z)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కలివేరు (Kaliveru) :
కలివేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన ఆనంద్ పర్వతారోహకుడు. 2014లో మలావత్ పూర్ణతో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. పెద్దమిడిసిలేరు (Peddamidisileru): పెద్దమిడిసిలేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలమునకు చెందిన గ్రామము. తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ఈ గ్రామపరిధిలో ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
చర్ల లేదా చెర్ల మండలం Charla or Cherla Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Kothagudem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి