12, సెప్టెంబర్ 2020, శనివారం

స్వామి అగ్నివేష్ (Swami Agnivesh)

జననం
సెప్టెంబరు 21, 1939
రంగం
సామాజిక కార్యకర్త
అవార్డులు
రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు, రైట్ లివ్లీ హుడ్ అవార్డు
మరణం
సెప్టెంబరు 11, 2020
సామాజిక కార్యకర్తగా, ఆర్యసమాజ్ నేతగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన స్వామి అగ్నివేష్ సెప్టెంబరు 21, 1939న శ్రీకాకుళంలో జన్మించారు. ఈయన అసలుపేరి వేపా శ్యామారావు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, మధ్యనిషేధానికి, దళిత గిరిజన అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రారంభంలో ఈయన సవ్యసాచి ముఖర్జీ (తర్వాత ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు) వద్ద జూనియర్‌గా లా ప్రాక్టీసు చేశారు. ఆర్యసమాజ్ స్పూర్తితో 1970లో ఆర్యసభ రాజకీయ పార్టీ స్థాపించారు. 1977లో హర్యానా శాసనసభకు ఎన్నికై రెండేళ్ళపాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

1981లో వెట్టిచాకిరి విముక్తికై బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ స్థాపించారు. 2004లో రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు, స్వీడన్‌కు చెందిన రైట్ లివ్లీ హుడ్ అవార్డు పొందారు. 2004-14 కాలంలో ఆర్యసమాజ్ అంతర్జాతీయ మండలి (1875లో దయానంద సరస్వతి నెలకొల్పినారు ఆధ్యక్షులుగా వ్యవహరించారు. అగ్నివేష్ సెప్టెంబరు 11, 2020న ఢిల్లీలో మరణించారు.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: సామాజిక కార్యకర్తలు, 2020లో మరణించిన ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక