అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు చంద్రుగొండ మండలంలో ఉన్న 10 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణాన ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన చుంచుపల్లి మండలం, ఉత్తరాన మరియు ఈశాన్యాన ముల్కలపల్లి మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన చంద్రుగొండ మండలం, దక్షిణాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 21130.
రాజకీయాలు:
ఈ మండలము అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సున్నం లలిత ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abbugudem, Annadevam, Annapureddypally, Gumpena, Namavaram, Narsapuram, Peddareddygudem, Pentlam, Teljerla, Vootupalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అన్నపురెడ్డిపల్లి (Annapureddypalli): అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం కొత్తగా మండల కేంద్రంగా మారింది. అదేసమయంలో ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలోకి చేరింది. గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయం, పురాతనమైన శ్రీవేంకటేశ్వరాలయం ఉన్నాయి.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Annapureddypalli Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి