త్రిపుర ఈశాన్య భారతదేశానికి చెందిన రాష్ట్రము. ఈ రాష్ట్ర రాజధాని అగర్తల. భౌగోళికంగా మరియు జనాభా పరంగా భారతదేశ చిన్న రాష్ట్రాలలో ఇది ఒకటి. 1972లో త్రిపుర రాష్ట్రంగా మారింది. తూర్పున మినహా మిగితా వైపులా బంగ్లాదేశ్ సరిహద్దును కల్గియుంది. ప్రముఖమైన త్రిపురాసుందరి ఆలయం త్రిపురలోని ఉదైపూర్‌లో ఉంది. ప్రముఖ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపాకర్మాకర్ ఈ రాష్ట్రానికి చెందినది. భౌగోళికం: త్రిపుర 10,491 చకిమీ వైశాల్యంతో దేశంలో మూడో చిన్నరాష్ట్రంగా ఉంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 36.7 లక్షలు. తూర్పున అస్సాం, మిజోరం రాష్ట్రాలు, మిగితా మూడూ వైపులా బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉంది. బొరొముర, అథరముర, లంగ్‌థరై, షఖాణ్, జంపూయి రాష్ట్రంలోని ప్రధాన పర్వతాలు. ధలై, మను, జురి, లోంగై, గుమ్తి, ముహురి, ఫెని నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. చరిత్ర: త్రిపుర ప్రాచీనమైన చరిత్రను కల్గియుంది. మహాభారతంలో మరియు అశోకుని శాసనాలలో కూడా త్రిపుర పేరు ప్రస్తావించబడింది. ఆధునిక కాలంలో త్రిపురను శతాబ్దాలపాటు మాణిక్య వంశం పాలించింది. బ్రిటీష్ వారి కాలంలో త్రిపుర సంస్థానంగా ఉండేది. 1949లో భారతదేశంలో విలీనమై క్లాస్ సి రాష్ట్రంగా, 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా, జనవరి 21, 1972న రాష్ట్రంగా మారింది. రవాణా సౌకర్యాలు: త్రిపురను మిగితా భారతదేశంతో కల్పే ఏకైక జాతీయ రహదారి నెంబర్ 8 రహదారి. కోల్‌కత నుంచి అగర్తక మధ్య భౌగోళికంగా 350 కిమీ దూరమే ఉన్ననూ మధ్యలో బంగ్లాదేశ్ ఉండుటచే 1700 కిమీ దూరాన్ని చుట్టిరావాల్సి ఉంటుంది. అగర్తలలో విమానాశ్రయం ఉంది. బ్రిటీష్ కాలంలోనే అగర్తకు రైలుమార్గం ఏర్పడిననూ దేశ విభజనతో లింకు తెగిపోయింది. మళ్ళీ 2008లో రైలుమార్గం వచ్చింది. రాజకీయాలు: త్రిపురలో 60 శాసనసభ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం ఉంది. 1978 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, 1978-88 మరియు 1993-2018 కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం చేపట్టింది. 2018లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
22, సెప్టెంబర్ 2020, మంగళవారం
త్రిపుర (Tripura)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి