బాచుపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు నిజాంపేట నగరపాలక సంస్థలో భాగము. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింద్. అదివరకు కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న 2 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం,
సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున కుత్బుల్లాపూర్ మండలం, ఉత్తరాన దుండిగల్ గండిమైసమ్మ మండలం, ఆగ్నేయాన కూకట్‌పల్లి మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. బాచుపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్
చేయండి. మండలంలోని గ్రామాలు:నిజాంపేట్, బాచుపల్లి,
ప్రముఖ రెవెన్యూ
గ్రామాలు: ..బాచుపల్లి (Bachupalli): బాచుపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది నిజాంపేట్ నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది రంగారెడ్డి జిల్లాలో ఉండేది. హైదరాబాదుకు సమీపంలో ఉన్నందున రియర్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందింది. నిజాంపేట్ (Nizampet): నిజాంపేట్ మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఈ గ్రామానికి చెందిన మేకల వెంకటేష్ 2006లో కుత్బుల్లాపూర్ ఎంపిపి అయ్యారు. 2018లో నిజాంపేట్ నగరపాలక సంస్థగా మారింది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన
పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bachupalli Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి