కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. మండల పరిధిలో జీడిమెట్ల, గాజులరామారం పారిశ్రామిక వాడలున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం 3 ముక్కలై కొత్తగా రెండు మండలాలు ఏర్పడ్డాయి. ఈ మండలంలోని 10 గ్రామాలను విడదీసి దుండిగల్ గండిమైసమ్మ మండలాన్ని, 2 గ్రామాలతో బాచుపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం రంగారెడ్డీ జిల్లా నుంచి కొత్తగా అవతరించిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన దుండిగల్ గండిమైసమ్మ మండలం, తూర్పున ఆల్వాల్ మండలం, దక్షిణాన బాలానగర్ మండలం, పశ్చిమాన బాచుపల్లి మండలం, నైరుతిన కూకట్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా 44వ నెంబర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 281340. ఇందులో పురుషులు 146712, మహిళలు 134628. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 502932. ఇందులో పురుషులు 260061, మహిళలు 242871. రాజకీయాలు: ఈ మండలము మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. కుత్బుల్లాపూర్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Quthbullapur, Gajularamaram, Suraram, Pet Basheerabad, Jeedimetla, Namdarnagar
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు: .గాజుల రామారం (Gajula Ramaram): గాజుల రామారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది మరియు జీడిమెట్ల పారిశ్రామికవాడ సమీపంలో ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధూక్షుడిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన కూన శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రాంతానికి చెందినవారు. జీడిమెట్ల (Jeedimetla): జీడిమెట్ల మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఫార్మా, కెమికల్స్ మరియు టెక్స్‌టైల్స్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. కుతుబుల్లాపూర్ (Qutbullapur): కుతుబుల్లాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. మొదట గ్రామపంచాయతీగా ఉన్న ఈ పట్టణం 1987 ఫిబ్రవరిలో పురపాలక సంఘంగా మారింది. అప్పుడు పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గాజులరామారం, సూరారం గ్రామాలు ఈ పురపాలికలో విలీనం చేశారు. 2007లో ఈ పురపాలక సంఘం గ్రేటర్ హైదరాబాదులో విలీనమైంది. 1987లో 30 వేల జనాభా ఉన్న పట్టణం ప్రస్తుతం లక్షకుపైగా పెరిగింది. జీడిమెట్ల, గాజులరామారం, గాంధీనగర్ పారిశ్రామిక వాడల ఏర్పాటుతో వలసలు అధికమైనాయి. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Qutbullapur Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి